Betel Leaf: మనదేశంలో అనేక ఆచారాలు, సాంప్రదాయాలు మిళితమై ఉన్నాయి. అయితే వీటి వెనుక ఉన్నటువంటి అంతరార్ధాలు ఎవరికీ పెద్దగా తెలియవు. ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు నిజంగానే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా తమలపాకు వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటో తెలుసుకుందాం. మన దేశంలో చాలా ప్రాంతాల్లో శోభనం రోజు పెళ్ళికొడుకు తమలపాకు తో తయారు చేసిన పాన్ తినడం ఆనవాయితీగా ఉంది.

అంతేకాకుండా చాలా ప్రాంతాల్లో భోజనం చేసిన తర్వాత కచ్చితంగా తమలపాకు పాన్ ను తీసుకుంటారు. అయితే తమలపాకును తీసుకోవడం వెనక చాలా రహస్యాలు ఉన్నాయి. తమలపాకును ఆరోగ్యపరంగా తీసుకుంటారు. తమలపాకులో విటమిన్- సి, క్యాల్షియం తోపాటు క్యాన్సర్ నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. అలాగే షుగర్ వ్యాధినీ రాకుండా మన ఆరోగ్య వ్యవస్థను మెరుగు పరుచుతాయి.
వీటితోపాటు కెరోటిడ్ లాంటి విటమిన్లు తమలపాకులో పుష్కలంగా ఉంటాయి. అలాగే రక్తపోటు, నోటి సంబంధిత వ్యాధులు, జీర్ణ సంబంధిత వ్యాధులను నయం చేయడంలో ఇవి అమృతంలా పనిచేస్తాయి. ఇక ఉబ్బసం, కడుపులో మంట, గ్యాస్ట్రిక్ లాంటి సమస్యలను నయం చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అందుకే చాలామంది తిన్న తర్వాత కచ్చితంగా తమలపాకుతో చేసిన పాన్ ను తీసుకుంటారు.
ఇలా తీసుకోవడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అందుకే కొత్తగా పెళ్లి అయిన వారికి ఇలా తమలపాకు తో తయారు చేసిన పాన్ లను తినిపించడం వల్ల వారి దాంపత్య జీవితం ఆరోగ్యంగా ఉంటుందని పెద్దల అభిప్రాయంగా తెలుస్తోంది. నిజంగా దీని వెనుక ఉన్నటువంటి రహస్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయి కదూ. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా వీలైనన్నిసార్లు తమలపాకును తినడానికి ప్రయత్నించండి. తమలపాకు తినడం వల్ల ఎలాంటి నోటి క్యాన్సర్ రాదు అంటూ సైంటిస్టులు చెబుతున్నారు.