Prabhas: యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకున్న నటుడు ప్రభాస్… ఈశ్వర్ సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన ఆయన మొదటి సినిమాతోనే సక్సెస్ ఫుల్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో అడుగుపెట్టిన ఆయన అప్పటినుంచి ఇప్పటివరకు వరుసగా పాన్ ఇండియా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు… ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఆయన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమా చేస్తున్నాడు.
అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాని సైతం కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ ఈ సంవత్సరం ఇప్పటికే ‘రాజాసాబ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అనుకున్న మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ప్రభాస్ అభిమానులు సైతం తీవ్రమైన నిరాశను వ్యక్తం చేశారు. స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తే మినిమం ఓపెనింగ్స్ అయిన వస్తాయని అలాగే వాళ్లకు ఉన్న బ్రాండ్ వాల్యూ హెల్ప్ అవుతుందని తను అనుకుంటున్నాడట…
ఫౌజీ, స్పిరిట్ రెండు సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ రెండు సినిమాలతో తను పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తానని చెబుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ప్రభాస్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్లో కొనసాగుతున్నాడు. కాబట్టి అతను ఇక కొడతా కూడా అదే కంటిన్యూ చేయాలి అంటే మాత్రం మరిన్ని సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది…
ఇక బాలీవుడ్ హీరోలకు సైతం పోటీని ఇస్తున్న ఆయన తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన టాప్ రేంజ్ లో ముందుకు దూసుకెళ్తేనే మన ఇండస్ట్రీ కూడా నెంబర్ వన్ లో ఉంటుంది. ఇక దాంతో పాటు మన హీరోలు కూడా నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగడానికి అవకాశం ఉంటుంది…