https://oktelugu.com/

Malayalam Beauties: నయా ట్రెండ్ సెట్ చేసిన మలయాళ ముద్దుగుమ్మలు!

Malayalam Beauties:స్టార్ హీరోయిన్స్ గా ఫార్మ్ లో ఉన్నవారు చెల్లి పాత్రలు చేయడానికి ససేమిరా అంటారు. దశాబ్దాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. ఫేడ్ అవుట్ అయిన స్టార్ హీరోయిన్స్ చెల్లి పాత్రలు చేశారు కానీ, ఒకపక్క సూపర్ స్టార్స్ తో నటిస్తూ మరో స్టార్ హీరో పక్కన చెల్లిగా నటించడం, ఈ మధ్య కాలంలో లేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ జనరేషన్ లో ఈ తరహా హీరోయిన్స్ ని మనం చూడవచ్చు. సాయి పల్లవి వంటి టూ టైర్ […]

Written By:
  • Shiva
  • , Updated On : November 24, 2021 / 06:45 PM IST
    Follow us on

    Malayalam Beauties:స్టార్ హీరోయిన్స్ గా ఫార్మ్ లో ఉన్నవారు చెల్లి పాత్రలు చేయడానికి ససేమిరా అంటారు. దశాబ్దాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. ఫేడ్ అవుట్ అయిన స్టార్ హీరోయిన్స్ చెల్లి పాత్రలు చేశారు కానీ, ఒకపక్క సూపర్ స్టార్స్ తో నటిస్తూ మరో స్టార్ హీరో పక్కన చెల్లిగా నటించడం, ఈ మధ్య కాలంలో లేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ జనరేషన్ లో ఈ తరహా హీరోయిన్స్ ని మనం చూడవచ్చు. సాయి పల్లవి వంటి టూ టైర్ హీరోయిన్ సైతం చిరంజీవి చెల్లిగా నటించడానికి ఒప్పుకోలేదు. చెల్లి పాత్రలు చేస్తే కెరీర్ మటాష్ అనే సెంటిమెంట్ అంత బలంగా నాటుకుని ఉంది.

    ఈ సాంప్రదాయాన్ని బ్రేక్ చేశారు.. కీర్తి సురేష్, నయనతార. సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న కీర్తి సురేష్, నయనతార ఫార్మ్ లో ఉండగానే చెల్లిగా మేకప్ వేసుకోవడానికి సిద్ధం అయ్యారు. కీర్తి సురేష్ ఆల్రెడీ రజినీకాంత్ సిస్టర్ గా పరిచయం అయ్యింది. దీపావళి రిలీజ్ అన్నాత్తే మూవీలో రజినీ ముద్దుల చెల్లిగా కీర్తి సురేష్ నటించారు. ఒకపక్క సూపర్ స్టార్ మహేష్ తో సర్కారు వారి పాట మూవీలో హీరోయిన్ గా చేస్తున్న కీర్తి, రజినీ చెల్లిగా చేయడం ఊహించని పరిణామం.

    Also Read: Prabhas Remuneration: ప్రభాస్ రెమ్యునరేషన్ తో ఎన్టీఆర్, మహేష్, పవన్ లతో మూడు సినిమాలు చేయవచ్చు!

    అలాగే చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీలో కూడా ఆమె చెల్లిగా కనిపించనున్నారు. చిరు సిస్టర్ రోల్ చేస్తున్నారు. కీర్తి ఇమేజ్ రీత్యా రజినీ, చిరు సిస్టర్ రోల్స్ చేస్తున్నారంటే అర్థం వుంది. బోల్డ్ హీరోయిన్ గా గ్లామర్ రోల్స్ చేసిన నయనతార చిరంజీవి సిస్టర్ గా నటించడానికి ఒప్పుకోవడం మైండ్ బ్లోయింగ్ అప్డేట్. సౌత్ లేడీ సూపర్ స్టార్ గా వెలుగొందుతూ.. షారుక్ లాంటి బాలీవుడ్ స్టార్ తో మూవీ చేస్తూ… ఆమె గాడ్ ఫాదర్ లో చెల్లి పాత్రకు సైన్ చేశారు. అయితే వీరి త్యాగం వెనుక టెంప్ట్ చేసే రెమ్యునరేషన్ కూడా ఉంది. చెల్లి పాత్రలకు 3-4 కోట్లు తీసుకుంటూ మరో ట్రెండ్ సెట్ చేశారు ఈ మలయాళ భామలు.

    Also Read: Bigg Boss Priya: నైట్ వేర్ లో హాట్ ఫోజులు.. బెడ్ రూమ్ వీడియో షేర్ చేసి షాకిచ్చిన బిగ్ బాస్ ప్రియ

    Tags