Prabhas: యూవీ క్రియేషన్స్ కు దూరమైన ప్రభాస్.. షాకింగ్ కారణం

యూవీ క్రియేషన్స్ సమర్ఫణలో ‘మిర్చి’ తరువాత భలే భలే మొగాడివోయే తదితర సినిమాలు వచ్చాయి. మొత్తం 11 చిత్రాలు తీయగా వీటిలో 5 బ్లాక్ బస్టర్ అయ్యాయి. మిగతావి యావరేజ్ హిట్టు కొట్టాయి.

Written By: Chai Muchhata, Updated On : May 29, 2023 5:31 pm

Prabhas

Follow us on

Prabhas: తెలుగు హీరోల రేంజ్ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో సాగుతోంది. వీరితో బాలీవుడ్ బిగ్ డైరెక్టర్స్ సినిమాలు తీసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు సైతం తెలుగు హీరోలపై ఎక్కువ నమ్మకం పెట్టుకుంటున్నారు. ఇదే సమయంలో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన కొన్ని నిర్మాణ సంస్థలు బీ టౌన్ కు పోటీగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి సినిమాలు తీస్తున్నాయి. వీటిలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ ఒకటి. హైదరాబాద్ లో ఏర్పాటైన యూవీ క్రియేషన్స్ ప్రభాస్ ‘మిర్చి’తో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీనే సక్సెస్ కావడంతో ప్రభాస్ ను తమ సక్సెస్ ఐకాన్ ను మార్చుకొని ఆయనతో పలు సినిమా తీసింది. కానీ ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థ ప్రభాస్ కు దూరం అవుతోంది. అందుకు కారణం లేకపోలేదు.

యూవీ క్రియేషన్స్ సమర్ఫణలో ‘మిర్చి’ తరువాత భలే భలే మొగాడివోయే తదితర సినిమాలు వచ్చాయి. మొత్తం 11 చిత్రాలు తీయగా వీటిలో 5 బ్లాక్ బస్టర్ అయ్యాయి. మిగతావి యావరేజ్ హిట్టు కొట్టాయి. అయితే ఎక్కువగా ప్రభాస్ చిత్రాలను పోటీ పడి దక్కించుకున్న యూవీ క్రియేషన్స్ ఇప్పుడు రెబల్ స్టార్ సినిమాలంటే భయపడుతోంది. ఆయన సినిమాలను టేకోవర్ చేసేందుకు ముందుకు రావడం లేదు. అందుకే ఆ సంస్థ నష్టాల్లో ఉండడమే కారణం. అయితే ఈ సంస్థ పరిస్థితి ఇలా మారడానికి ప్రభాస్ సినిమాలే కారణమని తెలుస్తోంది.

ఈ నిర్మాణ సంస్థ బ్యానర్లో చివరిసారిగా ‘సాహో’, ‘రాధే శ్యామ్’ సినిమాలు వచ్చాయి. ప్రభాస్ బాహుబలి తరువాత నిర్మించిన భారీ బడ్జెట్ మూవీ ‘సాహో’. దాదాపు రూ.300 కోట్ల ఇన్వెస్ట్ మెంట్ తో 3 సంవత్సరాలపాటు సాగిన ఈ మూవీ ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయింది. కానీ రిలీజ్ అయిన తరువాత భారీ డిజాస్టర్ గామిగిలింది. దీని తరువాత ప్రభాస్ నటించిన లవ్ ఎమోషల్ మూవీ ‘రాధీ శ్యామ్’. దీని పరిస్థితి అంతే. ఎంతో ఎక్స్ పెక్టేషన్ తో నిర్మించిన ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ఆడలేదు.

ప్రభాస్ తన స్నేహితులైన వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డిలు కలిసి 2013లో యూవీ క్రియేషన్స్ ను ఏర్పాటు చేశారు. ప్రభాస్ నటించిన దాదాపు సినిమాల్లో బాహుబలి మినగా అననీ వీరు టేకోవర్ చేశారు. ఇప్పుడు ఆయన నటించబోయే చిత్రాల్లో కూడా పాలు పంచుకుంటారన్న వార్తలు వచ్చాయి. అయితే ఇంతలో కొన్ని ప్రాజెక్టుల నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న రాజా డీలక్స్, స్పిరిట్ సినిమాలకు లోకల్ పార్ట్ నర్స్ గా యూవీ క్రియేషన్స్ ఉండాలి. కానీ వారికి దూరమైనట్లు తెలుస్తోంది.

రాజా డీలక్స్ మూవీ నిర్మాత అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఆదిపురుష్ తెలుగు హక్కులను రూ.170 కోట్లకు కొనుగోలు చేశారు. అయితే ఈ సినిమాలను యూవీ క్రియేషన్స్ ద్వారానే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తాజాగా జరిగిన అనూహ్య పరిణామాలతో ఇతర సంస్థలకు వెళ్లింది. అందుకు యూవీ క్రియేషన్స్ తీవ్ర నష్టాల్లో ఉందని అంటున్నారు. దీంతో యూవీ క్రియేషన్స్ కు ప్రభాస్ కు మధ్య దూరం పెరిగినట్లేనని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.