Mahesh Babu Guntur Karam: సూపర్ స్టార్ మాస్ స్ట్రైక్ కి రికార్డ్స్ మొత్తం బ్లాస్ట్.. పూనకాలు రప్పిస్తున్న ‘గుంటూరు కారం’ లేటెస్ట్ పోస్టర్

దీనికి సంబంధించిన ఒక మాస్ పోస్టర్ ని కాసేపటి క్రితమే విడుదల చెయ్యగా దానికి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది. మహేష్ గత కొంతకాలం నుండి మెసేజి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఫ్యాన్స్ బాగా విసుగెత్తిపోయారు, మాకు పోకిరి , బిజినెస్ మ్యాన్ కాలం నాటి ఊర మాస్ సూపర్ స్టార్ కావాలని డైరెక్టర్స్ ని డిమాండ్ చేస్తూ వచ్చారు.

Written By: Vicky, Updated On : May 30, 2023 1:07 pm

Mahesh Babu Guntur Karam

Follow us on

Mahesh Babu Guntur Karam: సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రానికి ‘గుంటూరు కారం’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో మహేష్ బాబు ని ఇది వరకు ఎన్నడూ చూడనంత మాస్ గా డైరెక్టర్ త్రివిక్రమ్ చూపించబోతున్నాడని టాక్. ఈ నెల 31 వ తారీఖున సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ మరియు గ్లిమ్స్ వీడియో ని విడుదల చెయ్యబోతున్నారు.

దీనికి సంబంధించిన ఒక మాస్ పోస్టర్ ని కాసేపటి క్రితమే విడుదల చెయ్యగా దానికి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది. మహేష్ గత కొంతకాలం నుండి మెసేజి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఫ్యాన్స్ బాగా విసుగెత్తిపోయారు, మాకు పోకిరి , బిజినెస్ మ్యాన్ కాలం నాటి ఊర మాస్ సూపర్ స్టార్ కావాలని డైరెక్టర్స్ ని డిమాండ్ చేస్తూ వచ్చారు.

ఫ్యాన్స్ డిమ్యాండ్స్ ని పరిగణలోకి తీసుకున్న డైరెక్టర్ త్రివిక్రమ్ మహేష్ ని ఫ్యాన్స్ ఎలా అయితే చూడాలనుకున్నారో, అందుకు పది రెట్లు ఊర మాస్ గా ఉండేవిధంగా చూపించబోతున్నాడు. గ్లిమ్స్ వీడియో తోనే అందరికీ ఒక క్లారిటీ వచ్చేస్తాడట. సూపర్ స్టార్ మాస్ ని మరోసారి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఎంజాయ్ చెయ్యడానికి సిద్ధం గా ఉన్నారు.

మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ అంచనాలను అందుకుంటాడా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం తాత్కాలిక విరామం తీసుకొని కుటుంబం తో కలిసి వెకేషన్ కి వెళ్లిన మహేష్ బాబు, జూన్ మొదటి వారం నుండి ప్రారంభం కాబొయ్యే సరికొత్త షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు. జూన్ నెల నుండి విరామం లేకుండా రెండు నెలల పాటు ఒక భారీ షెడ్యూల్ జరగబోతుంది.ఇక ఈరోజు విడుదల చేసిన పోస్టర్ లో మాస్ లుక్ లో కనిపిస్తున్న మహేష్ బాబు స్టిల్ గ్లిమ్స్ వీడియో నుండి తీసిందట.