Prabhas Anushka Wedding: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అతని పెళ్లి విషయంలో ఎప్పటికప్పుడు చాలా వార్తలు వచ్చాయి. కానీ అవేవి నిజం కాదంటూ ప్రభాస్ ఐతే వాటిని కొట్టి పారేస్తున్నాడు. గతంలో ప్రభాస్ – అనుష్క కాంబినేషన్లో చాలా సినిమాలు రావడం వల్ల వీళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ కుదిరిందని పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు అప్పట్లో హల్చల్ అయ్యాయి. అయినప్పటికి వాళ్ళు మాత్రం దానిమీద ఎలాంటి స్పందన తెలియజేయడం లేదు. మొత్తానికైతే ఇప్పుడు అభిమానులు ఏఐ ద్వారా అనుష్కల పెళ్లయితే చేశారు. ఇక ఈ పెళ్లికి సినీ సెలబ్రిటీలు చాలామంది హాజరవ్వడం విశేషం…ఇక ఈ పెళ్లి వీడియోలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ వంట చేస్తుంటే, రవితేజ హ బన్నీ డ్యాన్స్ వేస్తున్నారు.
నాగార్జున – నాని సన్నాయి వాయిస్తుంటే, బాలయ్య డోల్ కొడుతున్నట్టు, గోపీచంద్ వడ్డిస్తుంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్ భోజనం చేస్తున్నట్టు ఒక వీడియోను ఏఐ లో క్రియేట్ చేశారు. ఇక మొత్తానికైతే ఈ వీడియోకి మంచి ఆదరణ దక్కుతోంది. నిజాలు కావనుకున్న ద్వారా క్రియేట్ చేస్తూ ప్రేక్షకుల యొక్క మన్నానలను పొందుతున్నారు.
మొత్తానికైతే ఏఐ ద్వారా క్రియేట్ చేయలేనిది అంటూ ఏదీ లేదు. ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఏఐ ని వాడుతున్నారు. చూడాలి మరి ఏఐ ద్వారా ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి వీడియోలు క్రియేట్ చేస్తారు దాని ఇంపాక్ట్ జనాల మీద ఎలా ఉండబోతోంది అనేది… ప్రస్తుతానికైతే ప్రభాస్ ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యంలో లేనట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ప్రభాస్ ఇప్పుడు సినిమాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు.
50 సంవత్సరాల వయసుకు దగ్గరలో ఉన్న ప్రభాస్ ఇప్పటికి పెళ్లి చేసుకోకపోవడంతో అతని అభిమానులు తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు అనే వార్తలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి నటుడు సినిమాతో పాటు తన ఫ్యామిలీ లైఫ్ ని కూడా సెట్ చేసుకుంటే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం కామెంట్స్ చేస్తుండటం విశేషం…