Andhra King Taluka Twitter Talk: వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ అందుకుంటున్న రామ్(Ram Pothineni), ఈసారి కచ్చితంగా ట్రాక్ లోకి రావాలని కసిగా తీసిన చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా'(Andhra King Taluka Movie). మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి లాంటి భారీ కమర్షియల్ హిట్ తర్వాత మహేష్ బాబు దర్శకత్వం వహించిన చిత్రమిది. విడుదలకు ముందు ఈ సినిమా నుండి విడుదలైన ప్రతీ పాట బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. థియేట్రికల్ ట్రైలర్ చూసిన తర్వాత కూడా పర్వాలేదు బాగానే ఉంది అనే రేంజ్ లో ఉంది. మూవీ టీం కూడా ఈ సినిమా ని వేరే లెవెల్ లో ప్రమోట్ చేశారు. నాన్ స్టాప్ గా ఇంటర్వూస్ చేస్తే జనాలకు ఈ చిత్రాన్ని చేరువ చేసే ప్రయత్నం చేశారు. ఇలా అన్ని విధాలుగా పాజిటివ్ వైబ్రేషన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలైంది. మరి ఈ చిత్రం ఆడియన్స్ అంచనాలను అందుకుందో లేదో ఒకసారి చూద్దాం.
#AndhraKingTaluka A Satisfactory Fanism/Love Story that’s predictable and too lengthy, yet maintains a decent feel-good vibe throughout!
The film blends a hero & fan track with a love story to form an interesting drama. Both halves stay true to the core storyline and offer a few…
— Venky Reviews (@venkyreviews) November 27, 2025
ముందుగా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే డైరెక్టర్ స్క్రీన్ ప్లే ని కాస్త స్లో గా రాసుకున్నాడు, కానీ మంచి ఎంగేజింగ్ గానే రాసుకున్నాడు అని చూసిన ఆడియన్స్ ట్విట్టర్ లో కామెంట్స్ చేస్తున్నారు. సినిమా లో ఎక్కడా కొత్తదనం కనపడలేదు కానీ, ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అనే ఫీలింగ్ కలుగుతుందని అంటున్నారు. మ్యూజిక్ చాలా బాగుందట. ఓవర్ గ ఇష్టమొచ్చినట్టు డప్పులు వాయించకుండా , సన్నివేసిసానికి తగ్గట్టుగా చక్కటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెట్టారట. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ పర్వాలేదు, చూడొచ్చు అనే విధంగా ఉంటుందట. ఓవరాల్ సినిమా విషయానికి వస్తే, ఒక మంచి ఫ్యానిజం చూపించే సినిమా గా డైరెక్టర్ ఈ చిత్రాన్ని మలిచాడని, ఇలాంటి సినిమాల్లో లవ్ స్టోరీ ని ఇరికించడం చాలా కష్టం, కానీ డైరెక్టర్ లవ్ స్టోరీ పెట్టి ఫీల్ గుడ్ అయ్యే మూవీ లాగా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దాడని అంటున్నారు.
Parledu One Time Watch #AndhraKingTaluka
Conflict weak but drama decent ga handle chesadu. Length biggest drawback..20 minutes cut chesunte hit bomma..Still easily RAPO’s best since Nenu Sailaja
— Sai Prasad Reddy (@SaiPR535) November 27, 2025
సినిమాలో మైనస్ ఏమిటంటే, చూస్తున్నంత సేపు ఆడియన్స్ తర్వాత ఏమి జరగబోతుంది అనేది ఊహించగలరు, అంతే కాకుండా రన్ టైం ఎక్కువ ఉండడం కూడా ఈ సినిమాకు కలిసి రాలేదు. కొన్ని సన్నివేశాలు అవసరమా?, కావాలని ఇరికించాడు అన్నట్టుగా అనిపిస్తాయి. కొన్ని సన్నివేశాలను బాగా సాగదీసినట్టు అనిపిస్తాయని అంటున్నారు ఆడియన్స్. ఇక ఈ సినిమాకు ఉన్న అతి పెద్ద ప్లస్ పాయింట్ ఏమిటంటే డైలాగ్స్, హృదయాలను హత్తుకునే ఎమోషన్స్. రామ్ పోతినేని ఇందులో చాలా సహజంగా నటించాడని అంటున్నారు. సినిమా మొత్తం తనదైన స్టైల్ లో , మంచి ఈజ్ తో లాగేశాడని, అదే విధంగా రావు రమేష్ క్యారక్టర్ కూడా ఈ సినిమాకు హైలైట్ గా నిలిచిందని అంటున్నారు. ఓవరాల్ గా ఈ చిత్రం రీసెంట్ గా విడుదలైన రామ్ సినిమాలకంటే బెటర్ అని చెప్పొచ్చు.
Overall ga First half konchem Slow paced unna second half was completely emotional game by director and It was best on having great performances
Rao Ramesh Gariki National Award raavali I hope it will happen some day↕️
Thank you Sir @filmymahesh #AndhraKingTaluka
— రోహిత్ (@isrohithere) November 27, 2025