James Cameron: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సబ్స్క్రైబర్స్ ను కలిగి ఉన్న ఏకైక ఓటిటి ప్లాట్ఫామ్ ‘నెట్ ఫ్లిక్స్’…ప్రస్తుతం ఓటిటి లో టాప్ పొజిషన్ ను కైవసం చేసుకున్న ఈ సంస్థ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కడానికి ప్రయత్నం చేస్తోంది… ఇప్పటివరకు మంచి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు మాత్రమే నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. దాని ద్వారా ఆ సంస్థ మంచి పాపులారిటిని సంపాదించుకుంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ వాళ్ల నుంచి ఒక సినిమా ఓటిటికి వచ్చింది అంటే ఆ సినిమాకి మంచి గౌరవమైతే దక్కుతోంది. అందుకే ఓటిటి వాళ్ళు సెలెక్టెడ్ గా సినిమాలను కొనుగోలు చేస్తూ తమ బ్రాండ్ వాల్యూ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు…ఇక అందులో భాగంగానే అంతర్జాతీయ నిర్మాణ సంస్థ అయిన బ్రదర్స్ ని సైతం వాళ్లు కొనుగోలు చేయాలనే ఉద్దేశ్యంతో వాళ్ళతో మంతనాలు జరుపుతున్నారు. వార్నర్ బ్రదర్స్ ను కొనుగోలు చేయడం వల్ల వాళ్ళకొచ్చే ప్రయోజనం ఏంటి అంటే సినిమాల థియేటర్ స్క్రీనింగ్ విషయంలో కూడా ముందుకు అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని వల్ల భారీ రేంజ్ లో సినిమాలను రిలీజ్ చేసి తమ పరిధిని పెంచుకోవాలని ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది…
ఇక ఇదే విషయం మీద ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ అయిన జేమ్స్ కామెరూన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.
నెట్ ఫ్లిక్స్ వాళ్ళు వార్నర్ బ్రదర్స్ ని కొనుగోలు చేసినట్లయితే సినిమాకి ప్రమాదం జరగబోతుందని చెబుతున్నాడు. ఎందుకంటే సినిమాను థియేటర్లో ఆడించే రోజులు తగ్గిపోయాయని ఇక నెట్ ఫ్లిక్స్ సంస్థ వాళ్ళు వార్నర్ బ్రదర్స్ ను కొనుగోలు చేసి సినిమాలను ఆడించే ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళు ఒక వారం రోజులపాటు సినిమాని థియేటర్లో ఆడించి ఆ తర్వాత ఓటిటిలోకి తీసుకొస్తారు.
దీనివల్ల థియేటర్ ఎక్స్పీరియన్స్ పోతోంది. అలాగే థియేటర్ లో సినిమాలను చూడాలనుకున్న ప్రేక్షకులు సైతం చాలావరకు మిస్ అయిపోయే ప్రమాదం ఉంది… ఇక నెట్ ఫ్లిక్స్ వాళ్ళు వారం రోజులపాటు సినిమాని ఆడించడానికి ముఖ్య కారణం ఏంటి అంటే అవార్డుల ఫంక్షన్ కి అర్హత సాధించాలంటే అది థియేట్రికల్ రిలీజ్ అయి ఉండాలి.
కాబట్టి అందుకోసమే ఒక వారం రోజులపాటు థియేటర్లో ఆడించి ఆ తర్వాత ఓటిటి కి పరిమితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని వలన సినిమాకి అలాగే థియేటర్లకి సైతం భారీ ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు రావచ్చు అంటూ జేమ్స్ కామెరూన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి…