spot_img
Homeఎంటర్టైన్మెంట్Prabhas- Allu Arjun: కలుసుకున్న ప్రభాస్, అల్లు అర్జున్? కథేంటి?

Prabhas- Allu Arjun: కలుసుకున్న ప్రభాస్, అల్లు అర్జున్? కథేంటి?

Prabhas- Allu Arjun: తెలుగు సినిమాల రేంజ్ పెరిగిపోయిన విషయం తెలిసిందే. బాహుబలి నుంచి తెలుగు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతున్నాయి అంటే ఎదురు చూసే అభిమానుల సంఖ్య కూడా పెరిగింది. ఇప్పుడు కూడా మరో రెండు సినిమాల కోసం తెగ ఎదురుచూస్తున్నారు. సలార్, పుష్ప ది రూల్ సినిమాలు ప్రస్తుతం మన తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచేందుకు తయారవుతున్నాయి. కేజీఎఫ్ సిరీస్ లాంటి బ్లాక్ బస్టర్ అద్భుతాలను సొంతం చేసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సలార్ ను తెరకెక్కిస్తున్నారు అని తెలియగానే ఈ సినిమాపై హై రేంజ్ లో అంచనాలు పెరిగాయి.

సలార్ సినిమా డిసెంబర్ 22న తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత పుష్ప సినిమా రానుంది. పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పార్ట్ 2ను కూడా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సుకుమార్. ఇక ఈ సినిమాతో బన్నీకి నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఇక ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్ కోసం ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ కు హిందీలో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. సుమారుగా 80 మిలియన్ వ్యూస్ వచ్చాయంటే ఈ సినిమాకు బాలీవుడ్ లో ఉన్న రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

పుష్ప ది రూల్ ఆగస్టు 15న విడుదల అవబోతుందని తెలిసి అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. అల్లు అర్జున్ పై పలు కీలకమైన సన్నివేశాలు, సాంగ్ ను కూడా ఇక్కడే చిత్రీకరిస్తున్నారట చిత్ర యూనిట్. ఇక్కడ మరో అద్బుతమైన విషయం ఏంటంటే.. ఇదే రామోజీ ఫిలిం సిటీలో ప్రభాస్ సినిమా షూటింగ్ కూడా జరుగుతుందట. ప్రస్తుతం ఓ ఐటం సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ లో ప్రభాస్ పాల్గొన్నాడు.

ప్రభాస్ షూటింగ్ కు వచ్చాడు అని తెలియగానే అల్లు అర్జున్ వెంటనే సలార్ మూవీ స్పాట్ కి వెళ్లిపోయాడట. కాసేపు ప్రభాస్ తో సరదాగా గడిపి, నాలుగు కబుర్లు చెప్పుకొని, కొన్ని షాట్స్ చూసి అక్కడ నుంచి వెళ్లాడట. ఇలా ఒకే సారి ఒకే రోజు ఇద్దరి స్టార్ల సినిమాలు రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుంది అన్నమాట.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Most Popular

Dharmendra Pradhan Resignation: మోడీ నో అన్నా.. ఎట్టకేలకు ‘ధర్మేంధ్ర ప్రధాన్‌’ రాజీనామా.. తెరవెనుక ఏం జరిగిందంటే?

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలించాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. నీట్‌ ప్రశ్న పత్రం లీకేజీకి...

Akhil Akkineni: అక్కినేని అఖిల్ ఇండియన్ కాదా..? పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

Akhil Akkineni: అక్కినేని అఖిల్ రీసెంట్ గానే 'లెనిన్' చిత్రం తో తన కెరీర్ లోనే మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. విడుదలై రెండు వారాలు పూర్తి అయ్యింది , ఇప్పటికీ...

Kajal Aggarwal: నన్ను కసాయి తల్లి అని అనుకున్నా పర్వాలేదు.. నేను అలాగే చేస్తాను : కాజల్...

Kajal Aggarwal: పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకొని లేడీ సూపర్ స్టార్ రేంజ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్స్ లో ఒకరు కాజల్ అగర్వాల్....

Japan And US: జర్మనీ అణు రహస్యం జపాన్‌కు చేరకుండా అడ్డుకున్న అమెరికా.. లేదంటే ప్రపంచ పటమే మారిపోయేది!

Japan And US: ప్రపంచంలో ప్రస్తుతం అణ్వస్త్రాలు కలిగిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత రష్యా, చైనా, భారత్‌ కూడా ఉన్నాయి. ఇక ఏ దేశం కూడా అణ్వాయుధాలు కలిగి ఉండకుండా...

Jana Nayagan Collection: ‘జన నాయగన్ ‘ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇంత తక్కువ గ్రాస్...

Jana Nayagan Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై ,...
Oktelugu Epaper
Exit mobile version