Pawan Kalyan Special Treat: “భీమ్లా నాయక్” బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. తెలుగు రాష్ట్రాల నుంచి యూఎస్ఏ వరకు భారీ వసూళ్లను నమోదు చేస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమా సక్సెస్‌తో ‘భీమ్లా నాయక్’ టీంకు స్పెషల్ ట్రీట్ ఇచ్చి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి చెందిన సన్నిహితులు, ఆయనతో పని చేసిన కొందరు దర్శకులు హాజరయ్యారు. త్వరలో భారీ సక్సెస్ మీట్‌ని ఏర్పాటు చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇక రెండో రోజూ భీమ్లా నాయక్ వసూళ్లు అదిరిపోతున్నాయి. వీకెండ్ కావడంతో అభిమానుల హోరుతో నిర్మాతల ఖజానా కాసుల గలగలతో నిండింది. అయితే ఏపీలో టికెట్ రేట్ల కారణంగా కొన్ని రికార్డులను అధిగమించడంలో భీమ్లా వెనుకపడ్డాడు. రెండో రోజు రెండు రాష్ట్రాల్లో ‘బాహుబలి 2’ రూ. 14.80 కోట్ల షేర్ రాబడితే భీమ్లా రూ. 13.14 కోట్లు వసూలు చేశాడు. పుష్ప రూ. 13.70 కోట్లతో రెండో ప్లేస్‌లో ఉంది.
అన్నట్టు పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ సినిమా పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘భీమ్లానాయక్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ వైఫల్యాన్ని మాపై రుద్దేందుకు చంద్రబాబు, పవన్ డ్రామాలాడుతున్నారు. బ్లాక్ టికెట్లు అమ్ముకుని కొంతైనా బయటపడాలని చూస్తున్నారు. అఖండ మూవీ టైంలో ఉన్న GOనే ఇప్పటికీ అమల్లో ఉంది. ఫ్లాప్ సినిమాకు మార్కెటింగ్ చేస్తున్నారు’ అని మంత్రి అన్నారు.
Also Read: Bheemla Nayak Team Party: భీమ్లానాయక్ టీమ్‌కు అదిరిపోయే పార్టీ.. ఇచ్చింది ఎవరనుకున్నారు..?
‘భీమ్లా నాయక్’ సినిమా ప్లాప్ అంటూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన ఘాటు వ్యాఖ్యల పై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సినీ రంగం మీద ఏపీ ప్రభుత్వ తీరు సరిగ్గా లేదు అని.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై జగన్ ప్రభుత్వం కక్ష్య సాధిస్తోంది అని కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో దీనికి తగిన ప్రతీకారం తీర్చుకుంటామని పవన్ ఫ్యాన్స్ సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు.
ఏది ఏమైనా తెలుగు సినిమా పరిశ్రమను గత కొంత కాలంగా జగన్ ప్రభుత్వం క్షోభ పెడుతూ వస్తోంది. అయినా వ్యక్తిగత పగలు విద్వేషాలు ఉంటే.. రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలి గాని.. ఇలా ఒక సినిమా పై కక్షసాధింపులకు పాల్పడటం మంచి పద్దతి కాదు. అసలుకే బాక్సాఫీస్ వద్ద కరోనా కాటు వేసింది. ఇలాంటి టైంలో కూడా జగన్ ప్రభుత్వం ఇలా చేయడం మంచిది కాదు.
Also Read: Bheemla Nayak : ఇంతకీ ‘భీమ్లానాయక్’ క్రెడిట్ ఎవరిది?