https://oktelugu.com/

ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఆదిపురుష్’.. !

డార్లింగ్ ప్ర‌భాస్ కాస్త నేషనల్ స్టార్ ప్రభాస్ గా మారేసరికి బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాల‌తో.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ రేంజ్ ని పెంచుతూ పోతున్నాడు. కాగా తాజగా ముంబయిలో ఆదిపురుష్ లాంఛనంగా ప్రారంభమైంది. మొదటి షాట్ ను దేవుడి చిత్రపటాలపై, రెండో షాట్ ను హనుమంతుడి పాత్రధారిపై చిత్రీకరించారు. దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మైథలాజికల్ డ్రామాలో శ్రీరాముడిగా ప్రభాస్, రావణుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ […]

Written By:
  • admin
  • , Updated On : February 3, 2021 / 10:44 AM IST
    Follow us on


    డార్లింగ్ ప్ర‌భాస్ కాస్త నేషనల్ స్టార్ ప్రభాస్ గా మారేసరికి బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాల‌తో.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ రేంజ్ ని పెంచుతూ పోతున్నాడు. కాగా తాజగా ముంబయిలో ఆదిపురుష్ లాంఛనంగా ప్రారంభమైంది. మొదటి షాట్ ను దేవుడి చిత్రపటాలపై, రెండో షాట్ ను హనుమంతుడి పాత్రధారిపై చిత్రీకరించారు. దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మైథలాజికల్ డ్రామాలో శ్రీరాముడిగా ప్రభాస్, రావణుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నాడు. సీత పాత్ర కోసం ఆల్రెడీ హీరోయిన్ ను సెలక్ట్ చేసినా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

    Also Read: ‘ఉప్పెన’ తీసుకొస్తున్న ఎన్టీఆర్

    కాగా భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాను మోషన్ క్యాప్చుర్ టెక్నాలజీతో తీస్తున్నారు. తెలుగు-హిందీ భాషల్లో సైమల్టేనియస్ గా షూట్ చేసి.. మరో 7 భాషల్లో డబ్బింగ్ చేస్తారు. 2022 ఆగస్ట్ 11న ఆదిపురుష్ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఏది ఏమైనా ప్రభాస్ సినిమా అంటే.. ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీల టాలెంట్ కి గుర్తింపు అన్నట్టుగా భావిస్తున్నారు బాలీవుడ్ జనం. దానికి తగ్గట్టు నిజంగా బాలీవుడ్ సంస్థ టీసిరీస్ ఏ బాలీవుడ్ స్టార్ తోనో చేయకుండా, సౌత్ హీరోతో చేయడం నిజంగా ప్రభాస్ స్టార్ డమ్ కి దక్కిన గౌరవమే.

    Also Read: మహేష్ కథతో పవన్.. పూరి డైరెక్టర్

    ఇక ప్రభాస్ ఈ సినిమాలో మూడు పాత్రాల్లో కనిపిస్తాడని.. మెలుహా ల్యాండ్స్ లో సాగే ఈ క‌థ‌లో రాముడి పాత్రతో పాటు పరుశురాముడిగా కూడా ప్రభాస్ ను విజువ‌ల్ వండ‌ర్ గా చూపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక హాలీవుడ్ మూవీ `ది ఇమ్మోర్ట్స్ ఆఫ్ మెలుహా` సినిమాలోని మెలుహ పాత్రల శైలిలో ప్రభాస్ పాత్ర సాగుతోందట. ఇంతకీ ఈ మెలూహ అంటే నాగుల ర‌హ‌స్యం అన్నమాట. మరి ఈ పాయింట్ కి రామాయణంకు ఎలా లింక్ చేసారో చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్