దివంగత వైఎస్ఆర్.. పక్కా రైతుపక్షపాతిగా పేరుతెచ్చుకున్నారు. ఆయన పంచకట్టు ఆహార్యం అంతా రైతులాగానే కనిపిస్తుంది. వైఎస్ఆర్ చేపట్టిన జలయజ్ఞం నుంచి ఉచిత విద్యుత్ పథకాలన్నీ రైతుల చుట్టూనే తిరిగాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అమలు చేస్తున్న చాలా పథకాలు నాడు వైఎస్ఆర్ ప్రవేశపెట్టినవే కావడం విశేషం.
Also Read: ఏపీలో విద్యుత్ కొనుగోళ్లలో భారీ స్కాం..?
వైఎస్ఆర్ వారసుడు వైఎస్ జగన్ ఇప్పుడు ఏపీని ఏలుతున్నాడు. నాన్నను మించిన సంక్షేమాన్ని అమలు చేస్తున్నాడు. రైతురాజ్యాన్ని నెలకొల్పుతున్నాడు. నగదు బదిలీలతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు.
తాజాగా అన్నదాతల రక్షణ కోసం దేశంలో ఏ సీఎం చేయని పనిని జగన్ చేసి చూపించారు. రైతుల కోసం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన జగన్.. అన్నదాతల రక్షణకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని సూచించారు.
Also Read: ఎస్‌ఈసీపై సభా హక్కుల ఉల్కంఘన చర్యలు సాధ్యమేనా..?
ఏపీలోని రైతులకు రక్షణగా పోలీస్ వ్యవస్థ ఉండాలని సూచించారు. సీఎం జగన్ రైతుల సమస్యలపై ప్రత్యేకంగా జిల్లాకో పోలీస్ స్టేషన్ ఆలోచన చేస్తున్నామన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల వ్యవహారాల్లో మోసాలు జరిగితే రైతులకు న్యాయం చేయడం కోసం వ్యవస్థ ఏర్పాటు కావాల్సి ఉందన్నారు. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, న్యాయపరమైన చిక్కులను సత్వరమే పరిష్కరించడానికి ఈ పోలీస్ స్టేషన్లు ఉపయోగపడాలన్నారు.
ఏపీలో పోలీస్ వ్యవస్థపై సమీక్షించిన సీఎం జగన్ దిశ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. అన్ని పోలీస్ స్టేషన్ లలో మహిళా హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలన్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్