Salaar Movie: కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ‘ప్రశాంత్ నీల్’ దర్శకత్వంలో నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా “సలార్” అనే మరో పాన్ ఇండియా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ నుంచి ఓ వీడియో లీక్ అయి వైరల్ గా మారింది. ఇన్నాళ్లు ‘రాధే శ్యామ్’, ఆదిపురుష్ సినిమాల షూటింగ్ తో తీరిక లేకుండా గడిపిన ప్రభాస్, ఆ సినిమాలను దాదాపు పూర్తి చేశాడు.

అందుకే, ప్రస్తుతం సలార్ షూటింగ్ ను తిరిగి స్టార్ట్ చేశాడు. అన్నట్టు మూడు వారాల పాటు ఈ ‘సలార్’ కొత్త షెడ్యూల్ జరగనుంది. ఇక ఈ షెడ్యూల్ అంతా విలన్ డెన్ లో జరుగుతుందట. ఈ వీడియోలో లొకేషన్ కూడా డెన్ లోని ప్లేస్ లాగే ఉంది. అందుకే ‘సలార్’ విలన్ డెన్ కోసం ఈ సినిమా ఆర్ట్ డిపార్ట్మెంట్ భారీ సెట్ ను నిర్మించింది. ఈ సెట్ లోనే కీలకమైన యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు.
పైగా ప్రభాస్ పై యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు. అందుకే ఈ సెట్ ను పలు విధాలుగా చెక్ చేసి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ వీడియో లీక్ అవ్వకుండా మాత్రం జాగ్రత్తలు తీసుకోలేక పోయారు. ఏది ఏమైనా ప్రభాస్ తో హై వోల్టేజ్ యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నాడు అనగానే.. ‘సలార్’ పై పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అందుకే ప్రశాంత్ కూడా ఆ అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు.
నటీనటుల విషయంలో కూడా భారీ తారాగణాన్ని తీసుకున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాలో డార్లింగ్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. పైగా నేషనల్ స్టార్ అయ్యాక ప్రభాస్ చేస్తున్న మొట్టమొదటి ఫుల్ యాక్షన్ కమర్షియల్ సినిమా ఇది. అందుకే, ఈ సినిమా కోసం సినిమా వాళ్ళు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్ పూర్తి అయ్యాక, సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాంతంలో తర్వాత షెడ్యూల్ షూటింగ్ జరగనుంది. రామగుండం-3 పరిధిలోని సింగరేణి ఓసీపీ-2లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తారట. ఇప్పటికే అక్కడ భారీగా సెట్స్ కూడా వేశారు. ప్రభాస్ ప్రస్తుతం కేవలం ఈ సినిమా కోసమే బల్క్ డేట్స్ కేటాయించాడు.
#Salaar Leaked Shooting Video 🔥 #Prabhas 🥵💥 pic.twitter.com/AnRhzKelwM
— Prabhas (@Prabhas280) January 29, 2022