Boyapati With Ram Pothineni: యాక్షన్ చిత్రాల దర్శక దిగ్గజం బోయపాటి శ్రీను ‘అఖండ’తో అఖండమైన విజయాన్ని సాధించాడు. నటసింహం బాలయ్య బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టింది. దాంతో స్టార్ హీరోలు బోయపాటికి పిలిచి మరీ ఛాన్స్ లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అయితే, బోయపాటి తన తర్వాతి సినిమాను అల్లు అర్జున్ తో చేయాల్సి ఉంది. అయితే ‘పుష్ప2’ కోసం బన్నీ డేట్స్ ఇవ్వడంతో.. ఈ లోపు హీరో రామ్ తో మరో ప్రాజెక్టు చేయడానికి బోయపాటి సిద్ధం అవుతున్నాడు.

రామ్ కూడా లింగుస్వామి దర్శకత్వంలో ‘ది వారియర్’ చేస్తుండగా.. దాని తర్వాత బోయపాటితో మూవీ ఉండే ఛాన్సుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. మొత్తానికి రామ్ తో మూవీ ప్లాన్ చేస్తున్న బోయపాటి ? అంటూ ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది. పైగా రామ్, ఎప్పటి నుండో మాస్ హీరోగా ఎలివేట్ అవ్వాలని ఆశ పడుతున్నాడు. కాకపోతే బోయపాటి రామ్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు.

కానీ, బన్నీ ప్రస్తుతం ఖాళీగా లేడు కాబట్టి.. బోయపాటి – రామ్ కాంబినేషన్ ను సెట్ చేసే పనిలో నిర్మాత దిల్ రాజు బాగా కసరత్తులు చేశాడు. హీరో రామ్ కూడా బోయపాటితో సినిమా చేయడానికి బాగా ఆసక్తి చూపించాడు. ఈ క్రమంలోనే బోయపాటి రామ్ కి ఒక కథ చెప్పాడు. కథ కూడా రామ్ కి బాగా నచ్చింది. మొత్తానికి వీరిద్దరి కలయికలో సినిమా ఓకే అయిందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని వార్తలు వచ్చాయి.
Also Read: నేను బతకడానికి నాకు సంతోషాన్ని ఇచ్చేది ఇవే – మెగా డాటర్ ‘శ్రీజ’
ఏది ఏమైనా అఖండ సినిమా రికార్డు కలెక్షన్స్ దక్కించుకోవడం, బోయపాటికి తిరుగులేకుండా పోయింది. ఎలాగూ పుష్ప రెండు భాగాలు పూర్తి అయ్యాక, బన్నీ బోయపాటికి డేట్లు ఇవ్వడానికి ఇప్పటికే అంగీకారం తెలిపాడు. అందుకే, ఈ లోపు రామ్ తో బోయపాటి సినిమా ఖరారు అయింది. అసలు ‘అఖండ’ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ అంచనాలతో వచ్చి మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబడుతూనే ఉంది.
నిజానికి ఈ సినిమా కేవలం 8 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. ఇక అప్పటి నుంచి ఈ సినిమా పూర్తి లాభాల్లోనే నడిచింది. నటసింహం తన స్టార్ డమ్ ఏమిటో మరోసారి ఘనంగా బాక్సాఫీస్ సాక్షిగా గొప్పగా చాటుకున్నాడు. చాటుకున్నాడు అనడం కంటే.. బోయపాటి చాటాడు అనడం కరెక్ట్ ఏమో.
Also Read: టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ డేట్స్!