ETV Prabhakar Reacts On Trolls: ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది నటుడు ప్రభాకర్, అతని కొడుకు చంద్రహాస్ పరిస్థితి. మా వాడికి గుర్రపు స్వారీ, ఫైట్స్, డాన్సులు, జిమ్నాస్టిక్స్ నేర్పించేశాను… ఇక స్టార్ హీరో కావడమే తరువాయి అంటున్నాడు. కావడం కాదు ఆల్రెడీ అయిపోయినట్లు ఊహించుకుంటున్నారు. బుల్లితెర మెగాస్టార్ గా పేరున్న ఈటీవి ప్రభాకర్ తన కొడుకు చంద్రహాస్ ని హీరోగా పరిచయం చేస్తున్నట్లు తెలియజేస్తూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. ఈ పరిచయ కార్యక్రమంలో చంద్రహాస్ యాటిట్యూడ్, బిహేవియర్ చూసిన జనాలు… ఇదేం బిల్డప్ బాబోయ్ అన్నారు. ఇక ట్రోలర్స్ ఓ రేంజ్ లో ఏకిపారేశారు. ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అప్పుడే ఈ రేంజ్ యాటిట్యూడా అంటూ విమర్శలు గుప్పించారు.

కొడుకుపై వస్తున్న ట్రోల్స్ కి ప్రభాకర్ స్పందించారు . మంచో చెడో మావాడు జనాల్లోకి వెళ్లాడని సంబరపడ్డాడు. ఇప్పుడు నవ్వినవాళ్ళే మా వాడి పెర్ఫార్మన్స్ చూసి విజిల్స్ వేస్తారన్న విశ్వాసం వ్యక్తం చేశాడు. ఆ పరిచయ కార్యక్రమంలో చంద్రహాస్ యాటిట్యూడే కాదు మాటలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతానికి మూడు సినిమాలు చేస్తున్నా, ఇంకా కొన్ని లైన్లో ఉన్నాయి, అప్పుడే చెబితే బాగోదని చెప్పడం లేదు, అన్నాడు. ఇక నేను హీరో అయ్యేది ఖాయం.. క్రింద పడ్డా మీద పడ్డా పరిశ్రమలోనే ఉంటానని హామీ ఇచ్చాడు.
Also Read: Indira Devi -Namrata Shirodkar: కోడలు నమ్రతకు ఇందిరా దేవి ఇచ్చిన విలువైన ఆస్తులు ఏమిటో తెలుసా!
ఒకరకంగా చెప్పాలంటే తాను హీరోగా వెండితెరను ఏలేస్తాన్ని చెప్పకనే చెప్పాడు. కొడుకు బిల్డప్ కి మించి తండ్రి ప్రభాకర్ బిల్డప్ ఉంది. కొడుకుని ఆయన ఓ రేంజ్ లో ఎలివేట్ చేస్తున్నాడు. వాళ్ళ అబ్బాయి అసలు బ్రాండ్ తప్పితే వేరే వస్తువులు వాడడట. నాకు బ్రాండ్ పట్టింపులు లేవు కానీ మావాడు చాల పర్టిక్యులర్. చొక్కా, ప్యాంటు ఏదైనా బ్రాండ్ అయితే వేస్తాడు అన్నాడు. ఎలక్ట్రానిక్స్, బట్టలు విషయంలో బ్రాండ్ పేరుతో నన్ను చాలా ఇబ్బంది పెట్టాడని చెప్పుకొచ్చాడు.

ఒకసారి అమెరికా నుండి బ్రాండెడ్ వాచ్ తెప్పించాను. అది చూసిన చంద్రహాస్ బ్రాండెడ్ వాచ్ కాదు, నాకు వద్దన్నాడు. ఈ రోజుల్లో పిల్లలకు ఏది బ్రాండో ఏది కాదో ఇట్టే తెలిసిపోతుంది, అన్నాడు. ప్రభాకర్,చంద్రహాస్ మాటలు గమనిస్తున్న జనాలు ఇండస్ట్రీలో మరో మంచు ఫ్యామిలీ తయారైంది అంటున్నారు. ఇలాంటి సొంత డబ్బాలకు మోహన్ బాబు ఫ్యామిలీ చాలా ఫేమస్. వీరు వాళ్ళను కూడా దాటేసేలా ఉన్నారు. చంద్రహాస్ హీరోగా ఏ మేరకు సక్సెస్ అవుతాడో తెలియదు కానీ ప్రభాకర్ బిల్డప్స్ చూడలేకపోతున్నాం అంటున్నారు.
Also Read: Balakrishna- Mokshagna: ఒకే సినిమాలో బాలయ్య – మోక్షజ్ఞ… ఇదొక మైథలాజికల్ డ్రామా !
[…] […]
[…] […]