Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ కోసం పవర్ ఫుల్ విలన్… ఉస్తాద్ పై అంచనాలు పెంచేసిన హరీష్!

అయితే ఇటీవల మరలా పట్టాలెక్కించారు. హైదరాబాద్ లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఈ నెలాఖరు వరకు చిన్న షెడ్యూల్ చేస్తారు. అనంతరం హరీష్ శంకర్ ఇతర నటుల మీద సన్నివేశాలు చిత్రీకరిస్తారు.

Written By: Shiva, Updated On : September 27, 2023 11:09 am

Ustaad Bhagat Singh

Follow us on

Ustaad Bhagat Singh: దర్శకుడు హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ మూవీ ఫ్యాన్స్ డ్రీం కాంబినేషన్. 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. ఆ చిత్రంలో పవన్ కళ్యాణ్ ని హరీష్ ప్రజెంట్ చేసిన తీరు అద్భుతం. పవన్ మేనరిజమ్స్, వన్ లైనర్స్ పీక్స్ లో ఉంటాయి. ఫ్యాన్స్ కి ఓ రేంజ్ లో హై ఇచ్చిన సినిమా అది. ఈ కాంబో రిపీట్ కావాలని ఎప్పటి నుండో డిమాండ్ ఉంది. ఎట్టకేలకు అది సాకారం అయ్యింది. ఉస్తాద్ భగత్ సింగ్ టైటిల్ తో మూవీ తెరకెక్కుతుంది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ టూర్స్ కారణంగా ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ కి బ్రేక్ పడింది.

అయితే ఇటీవల మరలా పట్టాలెక్కించారు. హైదరాబాద్ లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఈ నెలాఖరు వరకు చిన్న షెడ్యూల్ చేస్తారు. అనంతరం హరీష్ శంకర్ ఇతర నటుల మీద సన్నివేశాలు చిత్రీకరిస్తారు. కాగా ఈ చిత్రంలో విలన్ గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. పవన్ కోసం ఓ పవర్ ఫుల్ విలన్ ని సిద్ధం చేశాడట. ఆయన ఎవరో కాదు ఆర్ పార్తీబన్.

దర్శకుడిగా, నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్ పార్తీబన్ సుదీర్ఘ కాలంగా కోలీవుడ్ లో రాణిస్తున్నారు. తెలుగులో ఆయన నటించిన చిత్రాలు తక్కువే. రచ్చ చిత్రంలో రామ్ చరణ్ తండ్రి పాత్ర చేశాడు. ఇక అప్పట్లో సంచలనం రేపిన యుగానికి ఒక్కడు మూవీలో చోళ రాజు పాత్రలో కనిపించి మెప్పించారు. అలా తెలుగువాళ్ళకు ఆయన పరిచయమే. కోలీవుడ్ లో విలన్, క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న పార్తీబన్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో విలన్ రోల్ చేస్తున్నారట.

ఈ న్యూస్ మూవీపై అంచనాలు పెంచేసింది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ తమిళ చిత్రం తేరి రీమేక్. అయితే దర్శకుడు హరీష్ శంకర్ సమూల మార్పులు చేశాడట. మూల కథను తీసుకుని దాదాపు ఒరిజినల్ మూవీ వలె తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మరోసారి క్రేజీ పోలీస్ రోల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి జంటగా శ్రీలీల నటిస్తుంది. దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.