https://oktelugu.com/

Pawan Kalyan: మరో రీమేక్ చిత్రానికి రెడీ అవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…

Pawan Kalyan: టాలీవుడ్ క్రేజీ హీరోగా ఏడాదికి ఒక్క సినిమా తీసిన బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ మూవీ ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు ఆయన అభిమానులు. ఈ ఏడాది లో విడుదలైన “వకీల్‌ సాబ్” సూపర్ హిట్ అందుకుంది. ఇదిలా ఉంటే మరో రీమేక్ చిత్రంతో అలరించనున్నారు పవర్ స్టార్. వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న రీమేక్ […]

Written By: , Updated On : December 17, 2021 / 04:19 PM IST
Follow us on

Pawan Kalyan: టాలీవుడ్ క్రేజీ హీరోగా ఏడాదికి ఒక్క సినిమా తీసిన బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ మూవీ ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు ఆయన అభిమానులు. ఈ ఏడాది లో విడుదలైన “వకీల్‌ సాబ్” సూపర్ హిట్ అందుకుంది. ఇదిలా ఉంటే మరో రీమేక్ చిత్రంతో అలరించనున్నారు పవర్ స్టార్. వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న రీమేక్ చిత్రం “భీమ్లా నాయక్”. ఈ సినిమా నుండి విడుదలైన పాటలు ప్రేక్షకులను ఎంత ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉంటే తాజాగా పవన్ హీరోగా మరో రీమేక్ ఖరారైనట్లుగా వార్తలొస్తున్నాయి.

Pawan Kalyan

power star pawan kalyan going to act in another remake movie

Also Read: 2021లో వచ్చిన హిట్ సినిమాల్లో ఎక్కువ శాతం ఈ కోవకు చెందినవే..

తమిళ చిత్రం “వినోదియ సిత్తం” ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో పవన్ హీరోగా నటించనున్నాడట. తెలుగులో  క్రాక్, అలా  వైకుంఠపురములో చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన సముద్రఖని ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది. ఆయనే స్వయంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడం మరో విశేషంగా చెప్పుకోవాలి‌. గతంలో కొన్ని హిట్ సినిమాలను తెరకెక్కించిన సముద్రఖని కొంత కాలంగా దర్శకత్వానికి దూరంగా ఉన్నారు. మళ్లీ మెగా ఫోన్ రావడంతో కాస్త గ్యాప్ తర్వాత తనే హీరోగా నటించిన ‘వినోదియ సిత్తం’ సినిమాను పవర్ స్టార్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ కథ అంశానికి వస్తే ఓ నడి వయస్కుడైన వ్యక్తి ఒక ప్రమాదంలో చనిపోయాక మూడు నెలల పాటు బతికే అవకాశం పొందుతాడు. ఆ మూడు నెలల్లో తన కోరికలను ఎలా నెరవేర్చుకున్నాడు.ఈ చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేయాలను కుంటున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ చిత్రాన్ని సముద్రఖనినే దర్శకత్వం వహిస్తాడట. ఈ సినిమా ఓకే అయితే పవర్ స్టార్ నటిస్తున్న 11వ రీమేక్ సినిమాగా నిలుస్తుంది.

Also Read: ఎన్టీఆర్ – చరణ్ కోసం స్పెషల్ స్పీచ్ లు రెడీ !