Pawan Kalyan- Director Sujeeth: ఒక పక్క రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ మరోపక్క సినిమాలు చకచకా చేస్తూ పవన్ కళ్యాణ్ క్షణకాలం కూడా తీరిక లేకుండా గడిపేస్తున్నాడు..ఈ ఏడాది భీమ్లా నాయక్ సినిమా ద్వారా అభిమానులను అలరించి సూపర్ హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వం లో ‘హరి హర వీరమల్లు’ చిత్రం లో నటిస్తున్నాడు..పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై అభిమానుల్లోనే కాదు..ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని కనివిని ఎరుగని రీతిలో అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడట డైరెక్టర్ క్రిష్..ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది..అయితే ఈరోజు షూటింగ్ బ్రేక్ లో పవన్ కళ్యాణ్ యూనిట్ సభ్యులందరికి తన సొంత ఖర్చులతో లంచ్ పెట్టాడట..ఈ లంచ్ కి కుర్ర డైరెక్టర్ సుజీత్ ని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు తెలుస్తుంది..ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇక అసలు విషయానికి వస్తే కొద్దీ రోజుల క్రితం సుజీత్ పవన్ కళ్యాణ్ ని కలిసి ఒక స్టోరీ లైన్ ని వినిపించాడనే వార్త ఫిలిం నగర్ లో బాగా ప్రచారం అయ్యింది..స్టోరీ లైన్ పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చడం తో వెంటనే దీనిని డెవలప్ చేసి ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ ని నాకు వినిపించు అని చెప్పాడట..అప్పటి నుండి డైరెక్టర్ సుజీత్ ఆ స్క్రిప్ట్ ని డెవలప్ చేసే పనిలో నిమగ్నమై ఇటీవలే పూర్తి చేసి నిన్న పవన్ కళ్యాణ్ ని కలిసి స్క్రిప్ట్ మొత్తాన్ని వినిపించాడు..పవన్ కళ్యాణ్ కి ఆ స్క్రిప్ట్ తెగ నచ్చేసింది..ఎంతలా అంటే గడిచిన దశాబ్దం లో తాను విన్న బెస్ట్ స్క్రిప్ట్ ఇదే అనే రేంజ్ లో ఆయనకీ నచ్చేసింది.

వెంటనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని ప్రారంభించి షూటింగ్ సిద్ధం చేసి చెప్పండి..డేట్స్ సర్దుబాటు చేస్తాను అంటూ సుజీత్ కి చెప్పాడట..అంతే కాకుండా తనకి అంత అద్భుతమైన స్క్రిప్ట్ ని సిద్ధం చేసినందుకు గాను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సుజీత్ ని నేడు విందు కి ఆహ్వానించాడట..ఇలా పవన్ కళ్యాణ్ కి ఒక కథ నచ్చి దర్శకుడికి ఈ రేంజ్లో మెచ్చుకోవడం జరిగి చాలా కాలమే అయ్యింది.