White Beard: ప్రస్తుతం కాలం మారింది. గడ్డం, వెంట్రుకలు తొందరగా తెల్లబడుతున్నాయి. చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడటంతో నలుగురిలో తిరిగేందుకు తిరిగేందుకు సిగ్గుపడుతున్నారు. గడ్డంలో తెల్ల వెంట్రుకలు కనబడకుండా రంగు వేసుకుంటున్నారు. అందరి గడ్డం పెంచుకోవడం ఓ స్టైల్ గా మారుతోంది. మీసాలు పెంచుకోవడం కూడా ఫ్యాషన్ గా చూస్తున్నారు. ఎంత పెద్ద వయసు వచ్చినా గతంలో వెంట్రుకలు తెల్లబడేవి కావు. చిన్న వయసులోనే గడ్డం తెల్లబడటానికి అసలు కారణాలేంటో తెలుసా? ప్రస్తుత కాలంలో మనం తీసుకుంటున్న ఆహారమే మనకు నష్టాలు తెస్తోంది. రంగు వేసుకున్నా అది తొందరగానే పోతుంది. కలర్ వేసుకున్నట్టు తెలిసిపోతోంది.

మన శరీరంలో మెలనిన్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది. దీని వల్ల మన వెంట్రుకలు తెల్లబడకుండా చేస్తుంది. శరీరానికి మంచి రంగు రావడానికి కారణమవుతుంది. వర్ణద్రవ్యం అన్ని జీవుల్లో కనిపిస్తుంది. మెలనిన్ లోపిస్తే మనకు కళ్లు, జుట్టు, చర్మం రంగు దెబ్బ తినడం ఖాయం. అందుకే తెల్లజుట్టు వచ్చేందుకు దోహదం చేస్తుంది. మెలనిన్ మనకు సమృద్ధిగా రావాలంటే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. జుట్టు రంగు తొలగడానికి ప్రధాన కారకం మెలనిన్ కావడంతో దాన్ని కాపాడుకుంటే మంచిది. లేదంటే తెల్ల జుట్టునే రాకుండా చేసుకోవాలి.
మెలనిన్ తో మనకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. జుట్టుకు, చర్మానికి మంచి రావడానికి సహకరిస్తుంది. ఇది పుష్కలంగా ఉండాలంటే సిట్రస్ పండ్లు ఎక్కువగా తీసుకుంటే మంచిది. ఆకుకూరలు, బెర్రీలు తింటే మేలు కలుగుతుంది. వీటితో శరీరంలో మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. జుట్టు తెల్లబడకుండా చేస్తుంది. దీంతో మనకు తెల్ల జుట్టు సమస్య ఏర్పడదు. మెలనిన్ సమృద్ధిగా లభించేందుకు తగిన ఆహారాలు తీసుకోవడం వల్ల ఎంతో ఉపయోగం కలుగుతుంది. జుట్టు తెల్లబడే ప్రమాదం నుంచి దూరం కావచ్చు.

పొగ తాగే అలవాటు ఉన్న వారిలో కూడా మెలనిన్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. మితిమీరిన ధూమపానం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోతే మెలనిన్ ఉత్పత్తిపై ప్రభావం చూపడం వల్ల తెల్ల జుట్టు వస్తుంది. దీంతో చిన్న వయసులోనే వెంట్రుకల కుదుళ్లకు రక్తప్రసరణ సక్రమంగా కాకపోవడంతో తెల్ల వెంట్రుకలు వస్తాయి. విటమిన్ సి, విటమిన్ ఎ ఉండే ఆహారాలు రోజు తీసుకుంటే ఫలితం ఉంటుంది. రోు వ్యాయామం చేస్తే ఈ సమస్య నుంచి కొంత వరకు ఉపశమనం లభిస్తుంది.