Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) – రానా దగ్గుబాటి (Rana Daggubati) కాంబోలో రాబోతున్న క్రేజీ మల్టీస్టారర్ ‘భీమ్లా నాయక్’. అనౌన్స్ తోనే క్యూరియాసిటీ పెంచిన ఈ మూవీ.. లేటెస్ట్ గా విడుదల చేసిన గ్లింప్స్ తో అంచనాలు అమాంతం పెంచేసింది. లుంగీ ఎగ్గట్టి.. పవర్ ఫుల్ డైలాగ్స్, ఫైట్స్ తో పవన్ ఇచ్చిన ఎంట్రీ.. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించిందనే చెప్పాలి. థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పవర్ స్టార్ యాక్షన్ తో.. భీమ్లానాయక్ గ్లింప్స్ దుమ్ము లేపింది. అయితే.. ఈ మూవీ ఓటీటీ డీల్ ముగిసింది. మరి, ఆ వివరాలు ఏంటన్నది చూద్దాం.
పవర్ స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో తెలిసిందే. పవన్ కు అభిమానులు ఉండరు.. భక్తులు మాత్రమే ఉంటారని చెబుతారు. అందుకే.. పవన్ ఏ మూవీ చేసినా.. ఫ్యాన్స్ మోత మోగిస్తారు. ఈ క్రమంలోనే.. ‘భీమ్లా నాయక్’ టైటిల్ అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన గ్లింప్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత పవన్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోతోనూ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.
దీంతో.. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే.. థియేట్రికల్ రిలీజ్ డేట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని ప్రకటించారు మేకర్స్. అటు పందెం పుంజులు.. ఇటు పవన్-రానా పోరు అదరహో అనిపించబోతున్నాయి. అయితే.. ఓటీటీ డీల్ బ్యాలెన్స్ ఉండిపోయింది. తాజాగా.. అది కూడా క్లోజ్ అయిపోయిందని తెలుస్తోంది.
భీమ్లానాయక్ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఇందుకోసం ఎంత చెల్లిస్తోంది అన్న ఫిగర్ బయటకు రాలేదుగానీ.. భారీ మొత్తంలో డీల్ సెట్ చేసుకున్నట్టు సమాచారం. పవర్ స్టార్ రీ-ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ కూడా అమెజాన్ లోనే స్ట్రీమ్ అయ్యింది. ఇప్పుడు భీమ్లానాయక్ కూడా అమెజాన్ లోనే ప్లే కానుంది. అయితే.. అంతకు మించి అన్న రేంజ్ లో ఈ చిత్రానికి ఎక్కువే వెచ్చించినట్టు టాక్.
మరి, థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఎన్ని రోజులకు ఓటీటీలో రిలీజ్ చేయాలనే విషయమై చాలా డిస్కషనే సాగింది. చర్చల తర్వాత ఇటు మేకర్స్.. అటు అమెజాన్ సంస్థ ఒక ఒప్పందానికి వచ్చాయి. దీని ప్రకారం.. సినిమా విడుదలకానున్న జనవరి 12 తర్వాత సరిగ్గా నెల రోజులకు స్ట్రీమింగ్ చేయనున్నట్టు సమాచారం. పవర్ స్టార్ – భల్లాల దేవ పోరాటం ఏ స్థాయిలో కొనసాగనుంది? అన్నది చూడాలి.