Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్లో పవర్ అస్త్ర కోసం పోటీ జరుగుతున్న విషయం తెలిసిందే. రణధీర టీమ్ లో ఉన్న శివాజీ, షకీలా, ప్రిన్స్ యావర్ లో పవర్ అస్త్ర రేసులో నిలిచారు. గౌతమ్ కృష్ణ నిర్ణయంతో ప్రిన్స్ యావర్ కూడా తప్పుకున్నాడు. ప్రిన్స్ యావర్ వద్ద ఉన్న మాయాస్త్ర భాగాలు శివాజీకి ఇవ్వాలని గౌతమ్ కృష్ణ చెప్పాడు. అంటే ప్రిన్స్ అనర్హుడు, శివాజీ అర్హుడని గౌతమ్ కృష్ణ నిర్ణయించాడు. దీంతో ప్రిన్స్ యావర్ ఫైర్ అయ్యాడు. ఎందుకు అని ప్రశ్నించాడు?. శివాజీ గేమ్ ప్లాన్ అందరూ అమలు చేశారనిపించింది, అందుకే శివాజీ అర్హుడని గౌతమ్ కృష్ణ అన్నాడు.
అది కరెక్ట్ రీజన్ కాదని ప్రిన్స్ యావర్ మండిపడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పవర్ అస్త్ర గెలిచే ఛాన్స్ కోల్పోవడంతో ప్రిన్స్ యావర్ కన్నీరు పెట్టుకున్నాడు. షకీలా కంటే కూడా ప్రిన్స్ యావర్ అర్హుడని రతికా రోజ్ వాదన మొదలుపెట్టింది. ఈ విషయంలో శోభా శెట్టి, రతికా మధ్య మాటల యుద్ధం నడిచింది.
ఇక రతికా రోజ్ ప్రిన్స్ యావర్ తో పులిహోర స్టార్ట్ చేసింది. అతన్ని తన మాటలు, నవ్వులతో బుట్టలో వేసుకునే ప్రయత్నం చేసింది. ప్రిన్స్ యావర్ కూడా మెలికలు తిరుగుతూ ఐ లైక్ యూ రతికా అని చెప్పాడు. ఆమె మీ టూ అని చెప్పింది. ఇద్దరూ వర్షం పడుతుండగా ఐ లవ్ యూ అని చెప్పుకున్నారు. ఫస్ట్ వీక్లో పల్లవి ప్రశాంత్ ఎమోషన్స్ తో ఆడుకున్న రతికా రోజ్, ఈసారి తన దృష్టి యావర్ వైపు మళ్లించింది.
పవర్ అస్త్ర రేసులో శివాజీ, షకీలా నిలిచారు. అనూహ్యంగా మూడో పోటీదారుడిని బిగ్ బాస్ తీసుకొచ్చాడు. రణధీర టీమ్ నుండి ఒకరిని పవర్ అస్త్ర కంటెండర్ ఎన్నుకోవాలని ఆట సందీప్ ని కోరాడు. అమర్ దీప్ చౌదరి పేరును సందీప్ సూచించాడు. కొత్తగా మరొకరిని పోటీలోకి తేవడం ఏమిటని షకీలా, శివాజీ అసహనం వ్యక్తం చేశారు. అందరూ గ్రూప్ గా ఆడుతున్నారు. ఇది కరెక్ట్ కాదని వాపోయారు. పవర్ అస్త్ర రేసులో ఉన్న శివాజీ, షకీలా, అమర్ దీప్ చౌదరికి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు.
ముగ్గురూ హౌస్లో ఏర్పాటు చేసిన చెవి బొమ్మ దగ్గరకు వెళ్లి గట్టిగా… బిగ్ బాస్ అని అరవాలి. ఎవరైతే బిగ్గరగా అరుస్తారో వారిదే పవర్ అస్త్ర అన్నారు. శివాజీ, షకీలా, అమర్ దీప్ చౌదరి బిగ్గరగా అరిచారు. ఇక విన్నర్ ఎవరనేది హోస్ట్ నాగార్జున తెలియజేస్తారు అన్నారు. ఈ ముగ్గురూ నామినేషన్స్ ఉన్నారు. ఇక పవర్ అస్త్ర ఎవరికి దక్కుతుందో చూడాలి…