Pottel Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే చాలా కొత్త కథలు వస్తున్నాయి. నిజానికి చిన్న సినిమాల్లో కొత్త కథలు రావడం అనేది అందరికీ ఆనందాన్ని కలిగించే విషయమనే చెప్పాలి. ఎందుకంటే పెద్ద సినిమాలు ఎప్పుడైనా ఒక భారీ స్కేల్లో వస్తూ కమర్షియల్ ఎలిమెంట్స్ ని ఆడ్ చేసుకొని తమ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను అలరించడమే కాకుండా భారీ కలెక్షన్లను తీసుకురావాల్సిన అవసరమైతే ఉంటుంది. దానివల్ల పెద్ద హీరోలు ఎక్స్పరిమెంట్లు చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. కానీ కొత్త హీరోలు మాత్రం ఎప్పుడు ఎక్స్పరిమెంట్లను చేస్తూ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతూనే ఉంటారు. ఇక ప్రస్తుతం ‘పొట్టేల్’ అనే కొత్త కథతో ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక ఊరిలో ప్రతి సంవత్సరం ఒక పండగ రోజు దేవుడికి పొట్టేలును బలిస్తుంటారు. అయితే ఒక సంవత్సరం మాత్రం దేవుడికి పొట్టేలు ను బలివ్వడం కుదరదు. ఎందుకు అలా జరిగింది. బలి ఇవ్వకపోవడం వల్ల దేవుడు ఆగ్రహించి ఊర్లో ఏదైనా ప్రమాదం జరిగేలా చేశాడా? అనేది తెలియాలంటే మాత్రం మీరు ఈ సినిమాని చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు సాహిత్ మోత్కూరి రాసుకున్న కథ స్టార్టింగ్ లో కొత్త వరకు ఒకే అనిపించేలా ఉంది. ఇక ఆ పొట్టేలు గురించి చెప్పే విధానం కూడా బావుంది. ఒక 20 నిమిషాల పాటు ప్రేక్షకుడికి ఎంగేజింగ్ గా అనిపించిన ఈ సినిమా హాఫ్ ఆన్ అవర్ తర్వాత నుంచి ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడంలో ఫెయిల్ అయిందనే చెప్పాలి. మంచి సినిమా అనుకుంటున్న సమయంలో లోనే సినిమా ఎటు వెళ్తుంది అనేది కూడా సినిమా చూసే ప్రేక్షకుడికి అర్థం అవ్వదు. అలాగే క్యారెక్టరైజేషన్ లో గాని, వరల్డ్ బిల్డింగ్ లో గాని పర్ఫెక్ట్ గా పోట్రె చేయలేకపోయారు. కారణం ఏదైనా కూడా ఆ క్యారెక్టర్లలో అంత సీరియస్ నెస్ కనిపించదు. అలాగే క్యారెక్టర్ ఇచ్చిన మోటివ్ పాయింట్ ను కాదని వాళ్ళకి వాళ్ళు ఇండివిజ్యువల్ గా పెర్ఫార్మ్ చేయడం స్టార్ట్ చేశారు.
ఒక క్యారెక్టర్ ఎటు నుంచి ఎటు వెళ్తుంది అనేది కూడా అర్థమవ్వదు. నిజానికి సందీప్ రెడ్డి వంగ లాంటి టాప్ డైరెక్టర్స్ వచ్చి ఈ సినిమాకి భారీగా ప్రమోషన్ చేశారు. అయినప్పటికి సినిమా లో ఉండాల్సిన సరైన ఎలిమెంట్స్ ని ప్రాపర్ గా రాసుకోకపోవడం వల్ల సగటు ప్రేక్షకుడికి బోర్ కొట్టించేలా ఉంటుంది. ఇక ఒకానొక సందర్భంలో అయితే ప్రేక్షకులకు చిరాకు పుట్టిస్తుందనే చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొంతవరకు పర్లేదు అనిపించినప్పటికి ఓవరాల్ గా సినిమాలో ఎమోషన్ అనేది మిస్సైంది. అలాగే దర్శకుడు ఏం చెప్పాలి అనుకొని ఈ సినిమాని తీశాడనేది కూడా ఒక కన్ఫ్యూజన్ లో సాగుతూ ఉంటుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమా పబ్లిసిటి చేసినంత స్థాయిలో లేదనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది.
మొత్తానికైతే ఈ సినిమా విషయంలో చాలామంది భారీ అంచనాలను పెట్టుకొని థియేటర్ కి వెళ్తున్నారు. కానీ వాళ్ళందరు నిరాశ చెందుతున్నారు… ఇక సినిమా మ్యూజిక్ విషయంలో కూడా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక సినిమాలో కొన్ని ఎలివేషన్స్ ఉన్నాయి. అక్కడ సరైన బ్యాగ్రౌండ్స్ కూడా పడలేదు. దానివల్ల సినిమా ఆశించిన మేరకు ప్రేక్షకుడిని ఆకట్టుకోలేదనే చెప్పాలి…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా నటించిన యువ చంద్ర కృష్ణ తన క్యారెక్టర్ పరిధి మేరకు ఓకే అనిపించాడు. ఇక అనన్య నాగాళ్ళ కూడా పర్లేదు అనిపించేలా నటించినప్పటికి ఆమె క్యారెక్టర్ కి అంత స్కోప్ అయితే లేనట్టుగా కనిపించింది. ముఖ్యంగా ఆమె పర్ఫామెన్స్ లో ఒక డిఫరెంట్ వేరియేషన్ ని చూపిస్తూ సినిమా మొత్తాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కానీ ఆమె క్యారెక్టర్ ను రాసిన విధానంలోనే దర్శకుడు చాలావరకు బ్లండర్ మిస్టేక్స్ అయితే చేశాడు. దానివల్ల ఆమె క్యారెక్టర్ ఎలివేట్ అవ్వలేదనే చెప్పాలి.
ఇక చాలా రోజుల తర్వాత అజయ్ కూడా చాలా మంచి పాత్రలో నటించాడు. నోయల్ కూడా కనిపించేది చిన్న పాత్ర అయినప్పటికీ అందులో చాలా బాగా నటించి మెప్పించాడు. శ్రీకాంత్ అయ్యంగార్, ఛత్రపతి శేఖర్ లాంటివారు వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే మ్యూజిక్ పెద్దగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయింది. శేఖర్ చంద్ర అందించిన మ్యూజిక్ ప్రేక్షకుల్లో ఏమాత్రం ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేదు. నిజానికి శేఖర్ చంద్ర అంటే చాలా మంచి మ్యూజిక్ ఇస్తారనే ఒక నమ్మకం అయితే అందరిలో ఉంది. అలాంటిది ఈ సినిమా విషయంలో ఆయన ఎందుకు నెగ్లేట్ చేశాడు అనేది కూడా అర్థం కావడం లేదు. ఇక మొత్తానికి అయితే ఈ సినిమా ఆశించిన మేరకు రాకపోవడంతో ఆయన బ్యాగ్రౌండ్ స్కోర్ ని కూడా పర్ఫెక్ట్ గా ఇవ్వలేకపోయాడనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది…
ఇక విజువల్స్ పరంగా చూసుకుంటే టాప్ రేంజ్ లో విజువల్స్ ఉండటం ఈ సినిమాకి చాలావరకు ప్లస్ అయిందనే చెప్పాలి… ఇక సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అయినప్పటికి సినిమా మాత్రం గ్రాండీయర్ గా తీయలేదనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది…
ప్లస్ పాయింట్స్
విజువల్స్
ఫస్ట్ 20 మినిట్స్
మైనస్ పాయింట్స్
కథ
స్క్రీన్ ప్లే
మ్యూజిక్
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2/5
చివరి లైన్
పొట్టేల్ టైటిల్ లో ఉన్న దమ్ము సినిమాలో లేదు..