Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హౌస్ లో ఇన్ని రోజులు జరిగిన టాస్కులు ఒక ఎత్తు అయితే, నిన్న ఎపిసోడ్ లో జరిగిన టాస్కులు మరో ఎత్తు. హౌస్ మేట్స్ అందరూ కూడా ప్రాణం పెట్టి ఆడారు. వాళ్ళు ఆడిన ఆట తీరుని చూస్తే ఎవరికైనా భయం వేయక తప్పదు. చేతులు, కాళ్ళు విరిగిపోతాయేమో అని అనుకున్నారు. ఈ టాస్క్ లో పృథ్వీ, నిఖిల్ రాయల్ క్లాన్ నుండి వచ్చిన గౌతమ్, మెహబూబ్, అవినాష్, టేస్టీ తేజ లను చిత్తుచిత్తుగా ఓడించి ఘన విజయం సాధించారు. ఇంతకీ టాస్క్ ఏమిటంటే బిగ్ బాస్ హౌస్ గేట్ ఎంట్రీ వద్ద ఒక స్లోప్ స్లైడ్ పెడుతారు. బయట నుండి గోధుమ బస్తాలు ఆ స్లైడ్ మీద వదులుతారు. దానిని ఇరు క్లాన్ సభ్యులలో ఎవరో ఒకరు పట్టుకొని, అవతల వైపు ఉన్న కార్ట్ లో వేయాలి. ఈ కార్ట్స్ ఇరు క్లాన్స్ కి విడివిడిగా ఉంటాయి. ఈ టాస్క్ కి యష్మీ సంచాలక్ గా వ్యవహరిస్తుంది. ఇరు క్లాన్స్ నుండి చెరో ఇద్దరు సభ్యులు రావాలని బిగ్ బాస్ ఆదేశిస్తాడు. ఓజీ క్లాన్ నుండి నిఖిల్, పృథ్వీ రాగా..రాయల్స్ క్లాన్ నుండి గౌతమ్, మెహబూబ్ ముందుగా వస్తారు.
ఈ రౌండ్ చాలా హోరాహోరీగా జరుగుతుంది. నిఖిల్ ని గౌతమ్ గట్టిగా పట్టుకొని కార్ట్ మీద బస్తా వెయ్యకుండా ఆపుతాడు. అవతల వైపు పృథ్వీ మెహబూబ్ ని గట్టిగా పట్టుకుంటాడు. వీళ్లిద్దరు గౌతమ్, మెహబూబ్ ని డిఫెండ్ చేసిన తీరు కి సెల్యూట్ చేయాల్సిందే. ఎట్టకేలకు నిఖిల్ గౌతమ్ ని అతి కష్టం మీద విడిపించుకొని కార్ట్ లో బస్తా వేస్తాడు. రెండవ రౌండ్ లో కూడా ఇంతే, హోరాహోరీగా తలపడ్డారు. గౌతమ్, మెహబూబ్ కి గాయాలు కూడా అయ్యాయి. మెహబూబ్ కి అయితే కాసేపటి వరకు ఊపిరి ఆడలేదు. ఈ రౌండ్ లో కూడా నిఖిల్,పృథ్వీ గెలుస్తారు. ఇక మూడవ రౌండ్ నిర్ణీత సమయంలో ఎవ్వరు బస్తాలను కార్ట్ వద్దకు చేర్చకపోవడం తో బిగ్ బాస్ గేమ్ కి తాత్కాలిక బ్రేక్ ప్రకటిస్తాడు.
అవసరమైతే కంటెస్టెంట్స్ ని మార్చుకోవచ్చు అని బిగ్ బాస్ చెప్పగా, రాయల్ క్లాన్ నుండి గౌతమ్, మెహబూబ్ టాస్క్ నుండి తప్పుకొని, టేస్టీ తేజ, అవినాష్ ని దింపుతారు. కమెడియన్స్ కదా అని తేలికగా తీసుకొని ఆడియన్స్ పెద్ద పొరపాటే చేసారు. కానీ ఈ టాస్క్ లో వీళ్లిద్దరు హీరోలు లాగా ఆడారు. పెనుగులాట లో అవినాష్, నిఖిల్ స్విమ్మింగ్ పూల్ లో పడిపోతారు. గత వారం గౌతమ్, నిఖిల్ కి మధ్య వాష్ రూమ్ లో పెద్ద గొడవ జరిగింది. ఇలాగే ముందు వెనుక చూసుకోకుండా ఆడేసారు. దెబ్బలు బాగా తగిలాయి. నాగార్జున చూసుకొని జాగ్రత్తగా ఆడండి అని ప్రత్యేకించి చెప్పాడు. కానీ ఈరోజు కంటెస్టెంట్స్ అది పూర్తిగా మర్చిపోయి ఆడారు. ఈ వీకెండ్ నాగార్జున నుండి మళ్ళీ కోటింగ్ పడే అవకాశాలు ఉన్నాయి.