సాధారణంగా సినిమాపై ఆసక్తితో ఎంతోమంది దర్శకులు సెలబ్రిటీలు ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు. ఈ క్రమంలోనే కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వాలంటే నిర్మాతలు కూడా వెనుకడుగు వేస్తారు.అయితే ఇలా అవకాశాల కోసం ఎదురు చూస్తూ అవకాశం వచ్చిన వారు ఎంతో కసిగా సినిమాలను తెరకెక్కించి ఎంతో అద్భుతమైన విషయాలను అందుకుంటారు. అలా విజయాన్ని అందుకున్న కొత్త దర్శకులలో టి మహిపాల్ రెడ్డి ఒకరు. ఈయన దర్శకత్వంలో విజయ్ ధరన్, రాశిసింగ్, అక్షత సోనావానే హీరోహీరోయిన్లుగా నటించిన పోస్టర్ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే…
కథ: సిద్దిపేటకు చెందిన శీను (విజయ్ దరణ్ ) ఏ పని లేకుండా ఖాళీగా తిరుగుతుంటారు. ఈ క్రమంలోనే ఇతని తండ్రి ఒకటి యేటర్ లో పనిచేస్తుంటారు. ఈక్రమంలోనే శీను థియేటర్ ఓనర్ పెద్దారెడ్డి కుమార్తె మేఘన (అక్షత) ప్రేమలో పడతారు. శీను ఎంతో ధైర్య సాహసాలు కలవాడు కావడంతో ఆ విషయం తెలుసుకున్న పెద్దారెడ్డి తనని తన దగ్గర పనిలో పెట్టుకుంటాడు. అయితే తన కూతురిని ప్రేమిస్తున్నాడని విషయం తెలుసుకోక పోయిన పెద్దారెడ్డి అనంతరం తాను తన కూతుర్ని ప్రేమిస్తున్నాడని తెలుసుకొని తన మనుషులతో తన ఇంటి పై దాడి చేస్తాడు. ఈ క్రమంలోనే తన తండ్రి తనని బయటకు గెంటి చేయడం ఆ తర్వాత వీరిద్దరూ ఎలా కలుసుకున్నారు అనే విషయం గురించి కథ సాగుతుంది.
విశ్లేషణ: ఈ విధమైనటువంటి విలేజ్ బ్యాక్డ్రాప్లో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. కథ రొటీన్ గా ఉన్నప్పటికీ ఆద్యంతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక తండ్రి తన కొడుకు భవిష్యత్తు కోసం ఏ విధంగా తపన పడతాడు వారి మధ్య ఉన్న బంధం ఎంతో హైలెట్ గా నిలబడింది. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్ గా సాగిపోయింది. ఇక సెకండ్ హాఫ్ కొద్దిగా ఉండటమే కాకుండా క్లైమాక్స్ సీన్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయింది అని చెప్పవచ్చు. అదే సమయంలో ల్యాగ్ అనేది సినిమాకి మైనస్ కాగా సెకండ్ హాఫ్ ఎంతో నిదానంగా కొనసాగుతోంది.
నటీనటులు: ఇందులో హీరో విజయ్ ధరణ్ సినిమాని ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా నటించడం కోసం ఎంతో ప్రయత్నం చేశాడు. ఇతని నటన చూస్తే ఇతనికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పవచ్చు. ఇక ఇందులో రాశి సింగ్ పక్కింటి అమ్మాయి పాత్రలో ఎంతో అద్భుతంగా చేసింది ఇక హీరోయిన్ అక్షత సోనావానే అటు గ్లామర్ గాళ్ అండ్ మోడ్రన్ విలేజ్ అమ్మాయిగా అదరగొట్టింది. ఇక హీరో తండ్రి పాత్రలో నటించిన శివాజీ రాజా నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తల్లి పాత్రలో నటించిన మధు మని ఎంతో సహజసిద్ధంగా నటించారు.
టెక్నికల్ టీం: టి. మహిపాల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన తొలి చిత్రం పోస్టర్. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు తీశారు అనే ఫీలింగ్ లేకుండా ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాకి శాండీ అద్దంకి అందించిన పాటలు ప్లస్ పాయింట్ అయ్యాయి. మార్తాండ కె వెంకటేష్ తన ఎడిటింగ్, కెమెరా మ్యాన్ రాహుల్ విజువల్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.
రేటింగ్: 2.75