Bigg Boss 7 Telugu Pallavi Prashanth: బిగ్ బాస్ షోలో రైతుబిడ్డగా కామన్ మ్యాన్ క్యాటగిరీలో ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి పల్లవి ప్రశాంత్. స్టేజి మీదకు ఎంట్రీ ఇవ్వడమే భుజాన బస్తా వేసుకొని.. ఇరు తెలుగు రాష్ట్రాల రైతుల భావాలను తన భుజస్కందాల మీద మోస్తున్న బిల్డప్ ఇస్తూ హౌస్ లోకి ఎంటర్ అయ్యాడు. వెళ్లడానికి ముందు రైతుల గురించి తెగ మాట్లాడిన ఇతను తీరా హౌస్ లోకి ఎంటర్ అయ్యాక మాత్రం పాపలతో పులిహోర కలుపుతూ బిజీ అయిపోయాడు.
హౌస్ లోకి రావడానికి ముఖ్య ఉద్దేశం రైతులకు సంబంధించిన కష్టాలను అందరికీ తెలియజేయడం అన్నట్టు మాట్లాడిన పల్లవి ప్రశాంత్ ఇప్పుడు అసలు తను రైతుని అన్న విషయం కూడా మర్చిపోయినట్లు ప్రవర్తిస్తున్నాడు. అయితే తాజాగా ఇతనిపై ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ ఛానల్ ఓనర్ అన్వేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వాడివన్నీ డ్రామాలే అంటూ ఒకే ఒక మాటతో పల్లవి ప్రశాంత్ ఎటువంటి వాడో తేల్చి చెప్పాడు.
వివరాల్లోకి వెళ్తే…పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షో లోకి రావడానికి ముందు ఒకసారి అన్వేష్ తో మాట్లాడడం జరిగిందట. నేను ఎలాగైనా బిగ్ బాస్ షో లోకి వెళ్లి పాపులర్ అవ్వాలి అన్న ప్రశాంత్ మాటలకు అవాక్కైనా అన్వేష్…ఆ షోలోకి వెళ్లడం వల్ల నీకేం వస్తుంది అని అన్నారట. నేను రైతుల గురించి అందరికీ తెలిసేలా చేస్తాను అని పల్లవి ప్రశాంత్ జవాబు ఇవ్వడంతో.. రైతుల గురించి అందరికీ తెలుసు ప్రత్యేకంగా నువ్వు చెప్పేది ఏమిటి అని అన్వేష్ ప్రశ్నించారు. దీంతో హర్ట్ అయిన పల్లవి ప్రశాంత్ అతన్ని బ్లాక్ చేయడం జరిగింది.
ఆ విషయాన్ని తాజాగా ఒక వీడియోలో వెల్లడించిన అన్వేష్ ..అసలు ఆ పల్లవి ప్రశాంత్ మొహం చూస్తేనే వాడు ఎంత పెద్ద మోసగాడు అర్థమవుతుంది అంటూ అన్నారు. అంతేకాదు రైతుల గురించి ఏమో చెప్తాను…. రైతులకు ఏమో చేస్తాను అని బిల్డప్ ఇచ్చి…. నన్ను బిగ్ బాస్ షోలోకి తీసుకోండి అని వీడియోలు మీద వీడియోలు పెట్టి…సింపతీ తో చివరికి హౌస్ లోకి వెళ్ళి.. అక్కడ….అమ్మాయిలతో డైలాగులు వేస్తూ తిరుగుతున్నాడు అని అన్వేష్ మండిపడ్డారు.
రైతుల గురించి ఎమోషనల్ వీడియోస్ చేసిన పల్లవి ప్రశాంత్.. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో జై జవాన్.. జై కిసాన్ అనకుండా.. నా గుండె ఏం చెప్తుందో తెలుసా ?నా మనసు ఎక్కడుందో తెలుసా? లాంటి ఓల్డ్ స్కూల్ రొమాంటిక్ డైలాగ్స్ చెప్పి అందరి దృష్టి ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే గతంలో పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలి అని చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ను కలవడం జరిగింది. వారిలో కొంతమంది అతనికి సహకరించగా కొంతమంది నిరాకరించారు. అలా నిరాకరించిన వాళ్ళల్లో ఒకరే నా అన్వేషణ.. అన్వేష్. బిగ్ బాస్ హౌస్ లో పల్లవి ప్రశాంత్ ప్రవర్తన పై సోషల్ మీడియాలో నెగెటివిటీ కనపడుతుంది. మరి ఈ విషయంలో మీ ఆలోచన ఏమిటి?