rChangure Bangaru Raja Traile: కంచరపాలెం ఫేమ్ కార్తీక్ రత్నం హీరోగా తెరకెక్కిన కామెడీ క్రైమ్ డ్రామా ఛాంగురే బంగారురాజా. ఈ చిత్రం విడుదలకు సిద్ధం కాగా ప్రొమోషన్స్ షురూ చేశారు. ఇక ఈ చిత్ర ట్రైలర్ హీరో రవితేజ విడుదల చేశారు. ఆయన తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేశారు ఛాంగురే బంగారు రాజా నిర్మాత రవితేజ కావడం విశేషం. ఇక రెండు నిమిషాలకు పైగా సాగిన ట్రైలర్ ఫన్, క్రైమ్ , సస్పెన్స్, రొమాన్స్ వంటి అంశాలతో సాగింది.
కొన్ని ప్రాంతాల్లో దొరికే వజ్రాల వేట నేపథ్యంలో సినిమా ఉంటుందనిపిస్తుంది. కథ అంతా పెల్లెటూరిలో సాగుతుంది. బంగార్రాజు, అతని మిత్రుడు తాతారావు చుట్టూ తిరుగుతుంది. ఒక వక్తి మర్డర్ చేయబడతాడు. ఆ మర్డర్ చేసింది ఎవరు? దీని వెనుక ఎవరున్నారనేది సస్పెన్సు అంశాలు. మరి పోలీసులు బంగార్రాజు వెనుక ఎందుకు పడుతున్నారనేది కూడా ఆసక్తికర కోణం.
బంగార్రాజుగా కార్తీక్ రత్నం చేశారు. అతని మిత్రుడు తాతారావు పాత్రలో సత్య నటించాడు. సత్య కామెడీ ట్రైలర్ కి హైలెట్ అని చెప్పాలి. రేపు వెండితెర మీద కూడా సత్య కామెడీ నవ్వులుపూయించడం ఖాయం. నటుడు రవి బాబు, అజయ్ కీలక రోల్స్ చేశారు. గోల్డి నిస్సి హీరోయిన్ గా చేశారు. ఛాంగురే బంగారురాజా ట్రైలర్ ఆకట్టుకోగా సినిమాపై అంచనాలు పెరిగాయి.
ఛాంగురే బంగారురాజా మూవీ సెప్టెంబర్ 15న విడుదల కానుంది. కొత్త దర్శకుడు సతీష్ వర్మ తెరకెక్కించాడు. కృష్ణ సౌరభ్ సంగీతం అందించారు.
