https://oktelugu.com/

Bigg Boss Telugu 8: 7వ వారం నామినేషన్స్ లోకి వచ్చిన 9 మంది కంటెస్టెంట్స్..డేంజర్ జోన్ లో ఉన్న ఇద్దరు వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్!

యష్మీ వీకెండ్ లో నామినేషన్స్ నుండి సేవ్ అయిన రెండవ కంటెస్టెంట్ గా నిలవడం సీతకు పెద్ద షాక్. ఇక ఆ తర్వాత ఆమె ఎలిమినేట్ అవ్వడం కూడా కోలుకోలేని షాక్ అనే చెప్పాలి. అయితే నిన్ననే నామినేషన్స్ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ నామినేషన్స్ ప్రక్రియ ఇంతకు ముందు వారాలు కంటే కొత్తగా ప్లాన్ చేసాడు బిగ్.

Written By:
  • Vicky
  • , Updated On : October 14, 2024 / 01:21 PM IST

    Bigg Boss Telugu 8(110)

    Follow us on

    Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 మొదలై ఆరు వారాలు పూర్తి చేసుకొని 7 వ వారంలోకి అడుగుపెట్టింది. ఆరవ వారం లో మొదటి నుండి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పిలవబడుతూ వచ్చిన సీత ఎలిమినేట్ అయ్యింది. గత వారం ఆమె యష్మీ ఎలిమినేట్ అయిపోతుందని చాలా బలంగా నమ్మింది. నమ్మడమే కాదు, ఎలిమినేట్ అయ్యి బయటకి వెళ్లిన తర్వాత నెగటివిటీ ని ఎదురుకోగలవా అని కూడా యష్మీ తో అనింది. కానీ యష్మీ వీకెండ్ లో నామినేషన్స్ నుండి సేవ్ అయిన రెండవ కంటెస్టెంట్ గా నిలవడం సీతకు పెద్ద షాక్. ఇక ఆ తర్వాత ఆమె ఎలిమినేట్ అవ్వడం కూడా కోలుకోలేని షాక్ అనే చెప్పాలి. అయితే నిన్ననే నామినేషన్స్ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ నామినేషన్స్ ప్రక్రియ ఇంతకు ముందు వారాలు కంటే కొత్తగా ప్లాన్ చేసాడు బిగ్. రెండు ఎరుపు రంగుతో ఉన్నటువంటి బోర్డ్స్ ఉంటాయి, అలాగే రెండు గుర్రాలు ఉంటాయి.

    మరో పక్క స్టాండ్ ఉంటుంది, ఆ స్టాండ్ మీద టోపీ ఉంటుంది. ప్రేరణ, హరి తేజ కిల్లర్ లేడీస్ గా ఉంటారు. గుర్రం శబ్దం వినపడగానే అటు పక్క కంటెస్టెంట్స్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఎరుపు రంగు బోర్డ్స్ మీద నిల్చుకోవాలి. అలాగే టేబుల్ మీద ఉన్న టోపీ కోసం కిల్లర్ లేడీస్ కూడా పరిగెత్తాలి. ఎవరి చేతిలో అయితే టోపీ ఉంటుందో, వాళ్ళు నామినేషన్స్ చేయడానికి వచ్చిన ఇద్దరు కంటెస్టెంట్స్ చెప్పే పాయింట్స్ లో ఎవరిది కరెక్ట్ అనిపిస్తే వాళ్ళ పాయింట్స్ ని పరిగణలోకి తీసుకొని నామినేట్ చేయాలి. అలా సాగిన ఈ ప్రక్రియ లో 9 మంది కంటెస్టెంట్స్ ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చారు. ఆ 9 మంది ఎవరంటే హరి తేజా , యష్మీ, ప్రేరణ, మణికంఠ, నిఖిల్, పృథ్వీ, టేస్టీ తేజ,నభీల్, గౌతమ్ కృష్ణ. అయితే ఈ నామినేషన్స్ ప్రక్రియ చాలా ట్విస్ట్స్ నడుమ జరిగింది. ఎక్కువసార్లు టోపీ పట్టుకున్నందున హరి తేజ ముందుగా సేవ్ అయ్యి, మరో కిల్లర్ లేడీ ప్రేరణ నామినేట్ అవుతుంది.

    రాయల్ క్లాన్ లో హరి తేజ కంటే ముందుగా అవినాష్ నామినేట్ అవుతాడు. అయితే రాయల్ క్లాన్ కి ఉన్నటువంటి ఇమ్మ్యూనిటీ షీల్డ్ ని ఉపయోగించి అవినాష్ ని సేవ్ చేసి, హరితేజ ని నామినేషన్స్ లోకి పంపుతాడు మెగా చీఫ్ మెహబూబ్. ప్రస్తుతం నామినేషన్స్ లోకి వచ్చిన ఈ 9 మంది కంటెస్టెంట్స్ నాలో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ టేస్టీ తేజా డేంజర్ జోన్ లో ఉన్నాడు. అతనితో పాటుగా పృథ్వీ, గౌతమ్ కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు. అందరికంటే అత్యధిక ఓట్లతో ప్రస్తుతం హరితేజ టాప్ స్థానం లో కొనసాగుతుంది. మరి వారం ఎలిమినేట్ ఎవరు అవ్వబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి అయితే టేస్టీ తేజ అందరికంటే తక్కువ ఓట్లతో చివరి స్థానంలో కొనసాగుతున్నాడు.