Mohan Babu House: ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగిన ఘటన ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. జల్ పల్లి లో మోహన్ బాబు కి ఒక అందమైన ఫామ్ హౌస్. ఇంద్ర భవనం ని తలపించే ఈ ఫామ్ హౌస్ లో ఒకసారి మంచు లక్ష్మి హోమ్ టూర్ కూడా చేసింది. ఆ వీడియో ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది. అయితే ఆ ఇంట్లో నమ్మకైనా పని మనిషి గా ఉండే నాయక్ అనే వ్యక్తి , ఇంట్లో ఎవ్వరూ లేని సమయాన్ని చూసి 10 లక్షల రూపాయిలను దొంగతనం చేసి పరార్ అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న మోహన్ బాబు వెంటనతె నాయక్ పై మంగళవారం రాత్రి రాచకొండ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసాడు.
దీంతో విచారణ మొదలు పెట్టిన పోలీసులు, నాయక్ ని తిరుపతి లో అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి దొంగతనం మోహన్ బాబు ఇంట్లో కొత్తేమి కాదు. గతం లో కూడా రెండు మూడు సార్లు జరిగాయి. ప్రతీ విషయం లోను ఎంతో జాగ్రత్తగా, క్రమశిక్షణతో వ్యవహరించే మోహన్ బాబు విషయం లోనే ఇలాంటి ఘటనలు ఎలా జరుగుతున్నాయి అనేది అంతుచిక్కని ప్రశ్న. తప్పు చేస్తే మోహన్ బాబు విధించే శిక్ష చాలా కఠినంగా ఉంటుంది, ఆయన దగ్గర పని చేసేవారు చాలా భయం తో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తారు అనే టాక్ ఉంది, అలాంటి స్థితిలో తన పని మనుషులను పెట్టినప్పటికీ కూడా ఇంత ధైర్యం గా దొంగతనాలు చేస్తున్నారంటే మామూలు విషయం కాదు.
ఇది ఇలా ఉండగా ప్రస్తుతం మోహన్ బాబు సినిమాలకు దూరం గా ఉంటున్న సంగతి తెలిసిందే. హీరో గా, విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ఇండస్ట్రీ లో తనదైన చెరగని ముద్ర వేసుకున్న మోహన్ బాబు, ఇప్పుడు తన దృష్టిని మొత్తం కేవలం విద్యానికేతన్ సంస్థలపైనే పెట్టాడు. అయితే మంచి పాత్రలు ఇస్తే చేయడానికి ఇప్పటికీ సిద్దమే అని మోహన్ బాబు చెప్తున్నా కూడా డైరెక్టర్స్ ఎందుకో ఆసక్తి చూపించడం లేదు. ఎలాంటి పాత్రని అయినా అలవోకగా చేయగలిగే సత్తా ఉన్న నటులలో ఒకరైన మోహన్ బాబు ని మన డైరెక్టర్స్ వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చివరిసారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. ఈ చిత్రంలో ఆయన హీరో గా నటించారు. మా ఎన్నికల తర్వాత విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఈయన మళ్లీ వెండితెర పై కనిపించలేదు. ప్రస్తుతం ఆయన పెద్ద తనయుడు మంచు విష్ణు హీరో గా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘కన్నప్ప’ కి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రం లో ప్రభాస్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More