Dhee Season 13- Poorna: హీరోయిన్ పూర్ణను బుగ్గలు కొరికే పిచ్చి వదలడం లేదు. ఆమె వయసులో ఉన్న యంగ్ డాన్సర్ ని ముద్దుల్లో ముంచెత్తుతూ వాళ్ళ ఏకాగ్రత చెడగొడుతుంది. డాన్స్ రియాలిటీ షో ఢీ 14లో ప్రత్యక్షమైన ఈ మలయాళీ భామ మళ్ళీ మొదలుపెట్టేసింది. డాన్స్ రియాలిటీ షోలలో ఢీకి ప్రత్యేక స్థానం ఉంది. కామెడీ, రొమాన్స్ కలగలిపి సరికొత్తగా నిర్వాహకులు దీన్ని తీర్చిదిద్దారు. రష్మీ, సుడిగాలి సుధీర్ ఉన్న ఉన్నప్పుడు ఈ షో మరింతగా దూసుకుపోయింది. లేటెస్ట్ సీజన్ నుండి వారు తప్పుకున్నారు. అలాగే జడ్జిగా ఉన్న పూర్ణ కూడా ఢీ 14లో కనిపించలేదు.

ఢీ సీజన్ 13లో పూర్ణ సంచనాలు చేశారు. కంటెస్టెంట్స్ తో పాటు మేల్ యాంకర్స్ తో రొమాన్స్ చేశారు. ప్రదీప్, సుధీర్, హైపర్ ఆది ఆమె కోసం పోటీ పడేవారు. పూర్ణ చేతి స్పర్శ కావాలని తాపత్రయ పడేవారు. ఆ సీజన్ కి పూర్ణ ప్రత్యేక ఆకర్షణ అయ్యారు. కాగా ఈ షోకి పూర్ణ ఒక కొత్త సాంప్రదాయం మొదలుపెట్టింది. అదేమిటంటే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన కంటెస్టెంట్స్ ని ముద్దుల్లో ముంచేసేది. అంత వరకూ ఓకే. అంతకు మించి ఆమె బుగ్గలు కొరకడం చేసేది.
ప్రియమణి మరో జడ్జిగా ఉన్న సీజన్ 13లో పూర్ణ రెచ్చిపోయి ఇలాంటి వ్యవహారాలు చేశారు. మరి అంతగా తెగించినా పూర్ణకు నిర్వాహకులు హ్యాండ్ ఇచ్చారు. సీజన్ 14 నుండి తప్పించారు. ప్రియమణిని మాత్రమే కొనసాగించి, రష్మీ, సుడిగాలి సుధీర్ లను కూడా బయటకు పంపేశారు. అయితే తాజా ఎపిసోడ్ కోసం ఆమె రంగ ప్రవేశం చేశారు. ప్రియమణి అందుబాటులో లేకపోవడంతో శ్రద్దా దాస్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. పూర్ణ రాకతో ఢీకి మునుపటి కళ వచ్చింది. వచ్చీ రావడంతోనే తన మార్క్ చూపించింది.

ఓ మేల్ కంటెస్టెంట్ గుచ్చి గుచ్చి గుండెల పైనే పచ్చబొట్టు… సాంగ్ కి డాన్స్ చేశాడు. అతని డాన్స్ కి ఇంప్రెస్ అయిన పూర్ణ తన వద్దకు పిలిచి… ముద్దు పెట్టమంటావా? బుగ్గ కొరకమంటావా? అని అడిగింది. ఆ డాన్సర్ రెండూ కావాలి అన్నాడు. అతని కోరిక మేరకు మొహమాటం లేకుండా రెండూ ఇచ్చేసింది. దీంతో ఆడియన్స్ మళ్ళీ స్టార్ట్ చేశావా తల్లి అంటున్నారు. ఈమెకు ఈ బుగ్గలు కొరికే ఫాంటసీ ఏంటని కామెంట్స్ పెడుతున్నారు. పెళ్లి కుదిరినా కూడా పూర్ణ ఈ విషయంలో తగ్గకపోవడం ఆశ్చర్యం వేస్తుంది. వ్యాపారవేత్తతో పూర్ణకు ఎంగేజ్మెంట్ కాగా త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది.