Munugode By Election- Chandrababu: ఏపీలోనే తేలిపోతోంది.. ఇక పక్కనున్న తెలంగాణలో ఏం పోటినిస్తుంది. ఇప్పటికే తెలంగాణలో అంతర్థానమైపోయిన పరిస్థితుల్లో అక్కడ ప్రయోగాలు చేయకూడదని.. పరువు పోగొట్టుకోకూదని చంద్రబాబు నిర్ణయించారు. అందుకే మునుగోడు ఉప ఎన్నిక చివరి నిమిషంలో చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి మునుగోడు బరిలో నిలవాలని భావించింది. ఈ మేరకు నేడు మునుగోడు టీడీపీ అభ్యర్థిగా జక్కలి ఐలయ్య యాదవ్ పేరును పార్టీ ఖరారు చేసినట్టు తెలిసింది. ఇక ప్రకటనే తరువాయి అనుకుంటున్న సమయంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో పోటీకి దూరంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉంటుందని బక్కని నర్సింహులు వెల్లడించారు. నాయకులు, కార్యకర్తలందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న టీడీపీ.. పోటీకి దూరంగా ఉండాలని.. సంస్థాగత నిర్మాణంపైనే దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నికలో పోటీకి దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించిందని.. నాయకులు, కార్యకర్తలు, అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఉప ఎన్నికలో పోటీకి దూరంగా ఉండాలని.. పార్టీ సంస్థాగత నిర్మాణంపైనే దృష్టి పెట్టాలని టీడీపీ నిర్ణయించిందని బక్కని నర్సింహులు తెలిపారు.

తెలంగాణలో ఇప్పటికే టీడీపీ పని ఖతమైపోయింది. మునుగోడులో బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఓడిపోయే చోట పోటీచేసి పరువు పోగొట్టుకోవద్దని.. టీడీపీ మరింత బలహీనం అయిపోయిందన్న సంకేతాలు పంపవద్దనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.