Poorna: దసరా మూవీ సెట్స్ లో దారుణ అనుభవం, ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటికీ తప్పలేదు!

మెయిన్ విలన్ పాత్ర టామ్ షైన్ చకో చేశారు. ఆయన భార్యగా పూర్ణ నటించారు. అయితే దసరా చిత్రాన్ని తలచుకుంటే కొన్ని భయానక అనుభవాలు గుర్తుకు వస్తాయని పూర్ణ చెప్పుకొచ్చారు.

Written By: Shiva, Updated On : September 30, 2023 2:21 pm

Poorna

Follow us on

Poorna: నటిగా, బుల్లితెర రియాలిటీ షోస్ జడ్జిగా పూర్ణ అలియాస్ షామ్నా ఖాసీం పరిచయం అక్కర్లేని పేరు. సీమ టపాకాయ్, అవును వంటి హిట్ చిత్రాలు ఆమెకు ఫేమ్ తెచ్చాయి. ఆరంభంలో సక్సెస్ లభించినా దాన్ని కంటిన్యూ చేయలేకపోయింది. ఈ కారణంగా పూర్ణ త్వరగా ఫేడ్ అవుట్ అయ్యింది. హీరోయిన్ గా రిటైర్ అయిన నేపథ్యంలో క్యారెక్టర్ రోల్స్ చేస్తుంది. అఖండ, దృశ్యం 2, తీస్ మార్ ఖాన్ చిత్రాల్లో ఆమె కీలక పాత్రలు చేశారు. 2023 బ్లాక్ బస్టర్స్ లో ఒకటైన దసరా మూవీలో పూర్ణ నటించిన సంగతి తెలిసిందే.

మెయిన్ విలన్ పాత్ర టామ్ షైన్ చకో చేశారు. ఆయన భార్యగా పూర్ణ నటించారు. అయితే దసరా చిత్రాన్ని తలచుకుంటే కొన్ని భయానక అనుభవాలు గుర్తుకు వస్తాయని పూర్ణ చెప్పుకొచ్చారు. ఆ చిత్ర షూటింగ్లో ఆమె కొన్ని ఇబ్బందులకు గురయ్యారట. పూర్ణ లేటెస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… దసరా చిత్రాన్ని అధిక భాగం రాత్రి షూట్ చేశారు. చలి కారణంగా చాలా ఇబ్బంది పడ్డాను.

అప్పుడు నేను ప్రెగ్నెన్సీ తో ఉన్నాను. అలానే కొన్ని సన్నివేశాల్లో నటించాల్సి వచ్చింది. ఓ సన్నివేశంలో నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మీద పరుగెత్తాలి. కనీసం కాళ్లకు చెప్పులు లేకుండా గర్భవతిగా ఉన్న నేను పరుగెత్తాను. దూరం నుండి వీధి కుక్కలు అరుస్తుంటే భయం వేసింది. అవి వెంబడించి కరుస్తాయేమో అని భయం వేసింది. అదృష్టవశాత్తు నన్ను అవేమీ చేయలేదు… అని అప్పటి భయానక అనుభవాలు గుర్తు చేసుకుంది.

2020లో పూర్ణ ఓ దారుణ సంఘటనకు గురైంది. ఓ గ్యాంగ్ ఆమెను హోటల్ లో బంధించి బ్లాక్ మనీ ట్రాన్స్ పోర్ట్ చేసేందుకు సహకరించాలని బ్లాక్ మెయిల్ చేశారు. అనంతరం ఆ గ్యాంగ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక తాను కెరీర్లో ఎదగకపోవడానికి నా నిర్ణయాలు కూడా కారణమయ్యాయని పూర్ణ గతంలో వెల్లడించారు. కొన్ని చిత్రాలు ఆమె ఉద్దేశపూర్వకంగా వదులుకోవాల్సి వచ్చిందట.

ఇక పూర్ణ వ్యక్తిగత జీవితం చూస్తే ఆమె గత ఏడాది దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని వివాహం చేసుకుంది. వీరి వివాహం రహస్యంగా జరిగింది. 2022లో అత్యంత సన్నిహితుల మధ్య దుబాయ్ లో పెళ్లి జరిగినట్లు పూర్ణ వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్ లో పూర్ణ ఓ బాబుకు జన్మనిచ్చింది.