Poonam Kaur: కొంతమంది సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా చేసే కామెంట్స్ సెగలు పుట్టిస్తుంటాయి. ఆ కోవలోకి చెందుతారు ఒకప్పటి హీరోయిన్ పూనం కౌర్. అయితే ఆమె నేరుగా ఎవరిని టార్గెట్ చేయరు. సందర్భాన్ని, ఘటనను అనుసరించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. ప్రధానంగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాసులపై పరోక్షంగా కామెంట్స్ చేస్తుంటారు ఈ నటి. కానీ ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయంలో డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. అయితే తాజాగా నేరుగా పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసి.. మరోసారి వార్తల్లో నిలిచారు పూనమ్ కౌర్.
* వీర మహిళల పోస్టుపై..
ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) సతీసమేతంగా మహారాష్ట్రలోని నాందేడ్ గురుద్వారాను సందర్శించిన సంగతి తెలిసిందే. అక్కడ నిర్వహించిన శ్రీ గురు తేజ్ బహుదూర్ షాహిది సమాగమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి అమరావతి పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు హాజరయ్యేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ వివరాలను జనసేన వీర మహిళా విభాగం అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్లు చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన భార్య అన్నా లెజినోవా కలిసి ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ సంప్రదాయ సిక్కు తలపాగాను ధరించి ఉన్నారు. అదే గెటప్ లో ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ లో కనిపించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించడంతో పూనం కౌర్ స్పందించారు.’ తమ వారసత్వాలను మార్చుకుని.. దుర్గుణాలను వదిలించుకునే వ్యక్తులు.. మన ప్రియమైన గురువు పట్ల ఎటువంటి గౌరవాన్ని చూపించరు. గురుతేజ్ బహుదూర్ జీ ఈ దేశం కోసం, ధర్మం కోసం ప్రతిదీ త్యాగం చేశారు. ఈ దుస్తులు, నకిలీ చిరునవ్వులు ఆ ధర్మాన్ని కప్పిపుచ్చడం తప్ప మరొకటి కాదు’ అని పూనం ట్విట్ చేశారు.
* గట్టిగానే రిప్లై
అయితే ఇంతటితో ఆగలేదు పూనం ట్వీట్ యుద్ధం. ఓ నెటిజన్ పవన్ కళ్యాణ్ ఫోటో షేర్ చేస్తూ ” సౌత్ నార్త్ అని ప్రాంతాల ఆధారంగా మనల్ని విభజించడానికి ప్రయత్నించే వారికి చెంపపెట్టు ” అని ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీనిపై పూనం స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. ” మతమార్పిడులకు బ్రాండ్ అంబాసిడర్. తన వారసత్వాన్ని క్యాథలిక్ క్రైస్తవ మతంలోకి మార్చుకున్న వ్యక్తి. హిందుత్వ ధర్మ రక్షక్ భాగాన్ని విడిచిపెట్టండి. గురుతేజ్ బహుదూర్ జీని ప్రార్థించవలసిన చివరి వ్యక్తి” అని పూనం రాసుకొచ్చారు. కానీ ఆయనకు మరో నెటిజన్ కౌంటర్ ఇచ్చారు. ” భిన్నత్వంలో ఏకత్వం అంటే అదే. ఓ గొర్రెల్లారా, నీకు ఇద్దరు మతాలను గౌరవించడం కూడా తెలియదు. అయినా అతను వారిని మతమార్పిడి చేయించలేదు. వారు సంప్రదాయ క్రైస్తవులు, ఇద్దరు పిల్లలు హిందువులు, ముందుగా కాస్త జ్ఞానం తెచ్చుకుని ఆ తర్వాత ఏడువు ” అని పూనంపై పోస్ట్ పెట్టారు. దానిపై ఆమె స్పందిస్తూ అదే పిల్లలను ఎలాంటి కారణం లేకుండా ఓ అపరిచిత వ్యక్తి కోసం వదిలేశాడు. ఆ పిల్లల తల్లిని అతని సోదరుడు వేధించాడు. సిగ్గుచేటు అని పోస్ట్ పెట్టింది. అయితే గతంలో ఎన్నడూ ఇంతలా నేరుగా టార్గెట్ చేయలేదు పూనం కౌర్.
రాష్ట్ర రాజధాని అమరావతి పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, సతీమణి శ్రీమతి అన్నా కొణిదెల గారు పాల్గొంటారు. pic.twitter.com/1U0ukmZ4Hu
— JanaSena VeeraMahila (@JSPVeeraMahila) January 25, 2026