Poonam Kaur: పూనమ్ కౌర్(Poonam Kaur)..సినిమాల ద్వారా ఈమె సాధించిన పాపులారిటీ పెద్దగా ఏమి లేదు. ఇండస్ట్రీ లోకి పెద్ద స్టార్ హీరోయిన్ అవ్వాలనే ఆశతో వచ్చింది, రెండు మూడు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది కానీ అవి వర్కౌట్ అవ్వలేదు. ఇక అప్పటి నుండి క్యారక్టర్ రోల్స్ చేసుకుంటూ వచ్చింది. అయితే ఈమె సినిమాల కంటే ఎక్కువగా వివాదాల ద్వారానే పాపులారిటీ ని సంపాదించింది. అప్పట్లో పవన్ కళ్యాణ్ పై కత్తి మహేష్ అనే వ్యక్తి ఏ రేంజ్ లో ఆరోపణలు చేస్తూ మీడియా చుట్టూ తిరిగేవాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . దాదాపుగా 8 నెలలు కేవలం ఈ అంశం మీదనే టాప్ మీడియా చానెల్స్ డిబేట్స్ నిర్వహించేవి. ఆ అంశం లో ఈమెకు సంబంధం లేకపోయినా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా మధ్య లో దూరింది. అప్పుడు కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ కి, పూనమ్ కౌర్ కి మధ్య రిలేషన్ ఉందని, తన దగ్గర ఆధారాలు ఉన్నాయని పెద్ద రచ్చ చేసాడు.
అలా పూనమ్ కౌర్ పేరు బాగా ఫేమస్ అయ్యింది. ఒక అమ్మాయిని మధ్యలోకి లాగి లేని పోనీ రిలేషన్స్ అంటగడుతున్నారు, పవన్ కళ్యాణ్ ఇందుకు రెస్పాన్స్ ఇవ్వాలంటూ అప్పట్లో పూనమ్ కౌర్ రచ్చ చేసింది. ఇక ఆ తర్వాత కొన్నాళ్ళకు త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకు జల్సా సినిమా లో అవకాశం ఇస్తానని చెప్పి వాడుకొని మోసం చేసి వదిలేసాడని, అతనొక దుర్మార్గుడు అంటూ పెద్ద రచ్చ చేసింది. ఇప్పటికీ సమయం దొరికినప్పుడల్లా త్రివిక్రమ్ శ్రీనివాస్ పై, అదే విధంగా పవన్ కళ్యాణ్ పై ఆమె పరోక్షంగా కౌంటర్లు ఇస్తూనే ఉంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఈమె చెప్పిన కొన్ని నిజాలు ఇప్పుడు సోషల్ మీడియా ని షేక్ చేస్తున్నాయి.
ఆమె మాట్లాడుతూ ‘ రాజకీయ లబ్ది కోసం నన్ను కొన్ని రాజకీయ పార్టీలు బెదిరించాయి. నాకు కావాల్సినంత డబ్బులు ఇస్తామని చెప్పారు, పదవులు ఇప్పిస్తామని చెప్పారు, ఒక ప్రముఖ హీరో కి వ్యతిరేకంగా మాట్లాడకపోతే నా న్యూడ్ వీడియోలు బయటకు విడుదల చేస్తామని చెప్పారు. ఇది ఒక ప్రముఖ పార్టీ కి సంబంధించిన వ్యక్తి, కడప జిల్లాకు చెందిన వాడు చేసిన బెదిరింపు. నేను నా స్నేహితుడిని ప్రేమించాను, అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. ఆ సమయం లో పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్ పెట్టి మరోసారి నా పేరు తీసుకొచ్చాడు. దాంతో నా పెళ్లి కూడా ఆడిపోయింది. అందువల్ల దిగ్బ్రాంతికి గురైన మా అమ్మకు గుండెపోటు కూడా వచ్చింది.’ అంటూ పూనమ్ కౌర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
పోసానిని ఎడమ కాలి చెప్పుతో ఎందుకు కొట్టకూడదో ఒక్క కారణం చెప్పండి…
రాజకీయ లబ్ధి కోసం ఒక ఆడదాని జీవితాన్ని, కుటుంబాన్ని నాశనం చేశారు “అందరూ” కలిసి…
చిన్న పిల్లల నాశనం కోరుకున్న చిల్లర ఎదవ పోసాని… pic.twitter.com/uDzLUhjFIt— thaNOs™ (@Thanos_Tweetss) January 4, 2026