Singer KK Remuneration: గత రెండు రోజుల నుండి ప్రముఖ సింగర్ కేకే మరణ వార్త విని యావత్తు సినీ లోకం తీవ్రమైన దిగ్బ్రాంతికి లోను అయినా సంగతి మన అందరికి తెలిసిందే..తన మధురమైన గాత్రం తో కేకే పాడిన ప్రతి ఒక్క పాట బ్లాక్ బస్టర్ హిట్ అయినవే..కేకే అంటే ఒక్క బ్రాండ్ అని చెప్పొచ్చు..తనకి సింగర్ గా ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ కూడా మాములు మనిషిలాగానే అభిమానులతో కలిసిపొయ్యేవాడు..ఎవరైనా కష్టాల్లో ఉంటె ఆదుకోవడానికి ముందు ఉండే వ్యక్తులలో ఒక్కరు కేకే..అలాంటి మనిషి ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా మనం చేసుకున్న దురదృష్టం..రెండు రోజుల క్రితం ఒక్క ఈవెంట్ లో పాట పాడుతున్న సమయం లో అస్వస్థకు గురైన కేకే ని వెంటనే ఆసుపత్రికి తరలిస్తున్న సమయం లో మార్గ మధ్యలోనే ఆయన తన తుది శ్వాస ని విడిచాడు..తన చివరి శ్వాస వరుకు తన జీవితం ని పాటకి అంకితం చేసిన కేకే గురించి సోషల్ మీడియా లో తెలిసిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
కేకే గారు ఎక్కువగా హిందీ లోనే పాటలు పాడారు..మన తెలుగు లో ఇప్పటి వరుకు ఆయన పాడిన పాటలు అన్ని చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి..ఘర్షణ సినిమా లో ‘చెలియా చెలియా’ సాంగ్ , ఇంద్ర సినిమాలో ‘దాయి దాయి దామ్మా’ సాంగ్ , ఆర్య సినిమాలో ‘ఫీల్ మై లవ్’ సాంగ్, ఆర్య 2 లో ‘ఉప్పెనంత ఈ ప్రేమకి’ సాంగ్,ఖుషి సినిమాలో ‘ ఏ మే రాజహా’ సాంగ్ మరియు జల్సా సినిమా లో ‘మై హార్ట్ ఈజ్ బీటింగ్’ సాంగ్, ఇలా ఒక్కటా రెండా తెలుగు లో ఆయన పాడిన ప్రతి ఒక్క పాట చార్ట్ బస్టరే,చెవుల్లో అమృతం పోసినట్టు అనిపించే కేకే గారి గాత్రానికి మంత్రం ముగ్దుడు కానీ ప్రేక్షకులు ఎవ్వరు ఉండరు.
Also Read: Poonam Kaur: నన్ను కార్నర్ చేయడం అంత ఈజీ కాదమ్మా… పూనమ్ దిమ్మతిరిగే కౌంటర్
.అందుకే ఆయనకీ ఒక్క పాట పాడినందుకు గాను నిర్మాతలు 3 నుండి 5 లక్షల రూపాయిలు పారితోషికంగా ఇచ్చేవారు అట..చిన్న బడ్జెట్ సినిమాలకు అయితే తక్కువ పారితోషికానికి పాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి..అలాంటి పాపులర్ డిమాండ్ ఉన్న గాయకుడు ఈరోజు మన అందరిని వదిలి వెళ్లిపోవడం , నిజంగా సినీ పరిశ్రమకి ఎవ్వరు పూడవలేని లోటు..ఈరోజు సజీవంగా ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ కూడా, ఆయన పాడిన పాటలు ద్వారా ఈ భూమి సజీవంగా ఉన్నంత వరుకు ఆయన మన మధ్యనే ఉంటాడు..ఆయన ఆత్మ ఎక్కడ ఉన్నా శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నివాళులు అర్పిస్తున్నాము.
Also Read: National Herald Case: సోనియా, రాహుల్ చేసిన ‘ఇండియన్ హెరాల్డ్’ మనీలాండరింగ్ అసలు కథ ఏంటి..?