https://oktelugu.com/

Poojitha Ponnada: ట్రైబల్ గర్ల్ గెటప్ లో కైపెక్కిస్తున్న రంగస్థలం బ్యూటీ… పూజిత పొన్నాడ గ్లామరస్ లుక్ వైరల్

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన రంగస్థలం ఇండస్ట్రీ హిట్ అందుకుంది. సమంత హీరోయిన్ గా నటించిన ఆ చిత్రంలో పూజిత హీరో అన్నయ్య ఆది పినిశెట్టి లవర్ రోల్ చేసింది.

Written By: , Updated On : March 13, 2024 / 03:13 PM IST
Poojitha Ponnada glamorous look goes Viral

Poojitha Ponnada glamorous look goes Viral

Follow us on

Poojitha Ponnada: వెండితెరపై వెలిగిపోవాలని వచ్చింది తెలుగు భామ పూజిత పొన్నాడ. వైజాగ్ కి చెందిన పూజిత 2016లో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. నాగార్జున-కార్తీ కాంబోలో వచ్చిన మల్టీస్టారర్ ఊపిరి మూవీలో చిన్న పాత్ర చేసింది. ఊపిరి చిత్రం లో తమన్నా హీరోయిన్ కాగా… పూజిత ఆర్ట్ గ్యాలరీ మేనేజర్ రోల్ చేసింది. అనంతరం ‘దర్శకుడు’ చిత్రంలో నటించింది. సుకుమార్ నిర్మించిన దర్శకుడు చిత్రం అంతగా ఆడలేదు. అయితే మూడో చిత్రం రంగస్థలంతో భారీ హిట్ కొట్టింది.

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన రంగస్థలం ఇండస్ట్రీ హిట్ అందుకుంది. సమంత హీరోయిన్ గా నటించిన ఆ చిత్రంలో పూజిత హీరో అన్నయ్య ఆది పినిశెట్టి లవర్ రోల్ చేసింది. పెద్దగా స్క్రీన్ స్పేస్ లేకపోయినా కథను మలుపు తిప్పే రోల్ ఆమెది. రంగస్థలం తర్వాత కెరీర్ ఊపందుకుంటుంది అనుకుంటే అలా ఏం జరగలేదు. మెయిన్ హీరోయిన్ గా పూజిత పొన్నాడకు ఆఫర్స్ రాలేదు. సెకండ్ హీరోయిన్, సపోర్టింగ్ రోల్స్ కి మాత్రమే పరిమితం చేశారు.

రాజుగారు, బ్రాండ్ బాబు, హ్యాపీ వెడ్డింగ్, కల్కి, 7 చిత్రాల్లో పూజిత నటించింది. నవదీప్ కి జంటగా రన్ టైటిల్ తో సైకలాజికల్ థ్రిల్లర్ చేసింది. ఈ చిత్రంలో పూజిత పొన్నాడ మెయిన్ హీరోయిన్ గా నటించింది. రన్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. కాగా పూజిత పొన్నాడ చేతిలో ఒక భారీ ప్రాజెక్ట్ ఉంది. హరి హర వీరమల్లు చిత్రంలో ఆమె ఐటెం నెంబర్ చేస్తున్నారని సమాచారం. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న హరి హర వీరమల్లు పవన్ కళ్యాణ్ పొలిటికల్ షెడ్యూల్స్ కారణంగా ఆగిపోయింది. ఎన్నికల అనంతరం ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.

హరి హర వీరమల్లు తో పూజిత పొన్నాడకు బ్రేక్ రావచ్చు. ఇది పాన్ ఇండియా మూవీ. అందులోనూ పవన్ కళ్యాణ్ హీరో కాబట్టి విపరీతమైన రీచ్ దక్కుతుంది. అలా పూజిత పొన్నాడ ఫేమ్ రాబట్టే ఛాన్స్ ఉంది. మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. తాజాగా ట్రైబల్ లుక్ లో మెస్మరైజ్ చేసింది. ట్రైబల్ గెటప్ పూజిత పొన్నాడకు చక్కగా సెట్ అయ్యింది. సోషల్ మీడియాలో పూజిత పొన్నాడ లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ కామెంట్స్ తో ఆకాశానికి ఎత్తేస్తున్నారు.