Pooja Hegde: హీరోయిన్ పూజా హెగ్డే టైం ఏం బాగోలేదు. ఒకప్పుడు ఈమె పట్టిందల్లా బంగారమైంది. దానికి పూర్తి విరుద్ధంగా పరిస్థితులు తయారయ్యాయి. చేసిన సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. చేతిలో ఉన్న సినిమాలు చేజారిపోతున్నాయి. ఏడాది కాలంగా పూజా హెగ్డేను దురదృష్టం వెంటాడుతుంది. కెరీర్ బిగినింగ్ నుండి పూజా హెగ్డే స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. ఆఫర్స్ వస్తున్నా విజయాలు దక్కేవి కావు. ఒక దశలో ఫేడ్ అవుట్ స్టేజ్ కి వెళ్ళిపోయింది. రంగస్థలం మూవీలో ఐటెం సాంగ్ కూడా చేసింది. అయితే దర్శకుడు త్రివిక్రమ్ లిఫ్ట్ ఇచ్చాడు.
ప్లాప్స్ లో ఉన్న పూజాకు ఎన్టీఆర్ పక్కన ఛాన్స్ ఇచ్చాడు. అరవింద సమేత వీరరాఘవ హిట్ టాక్ తెచ్చుకోగా పూజాకు బ్రేక్ వచ్చింది. తర్వాత మహర్షి, అల వైకుంఠపురంలో చిత్రాలతో నిలదొక్కుతుంది. ఇబ్బడిముబ్బడిగా ఆఫర్స్ వచ్చిపడ్డాయి. తెలుగు, తమిళ భాషల్లో స్టార్స్ పక్కన సైన్ చేసింది. రాధే శ్యామ్ మూవీతో పూజా హెగ్డేకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ప్లాప్ అయ్యాయి.
మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్ గుంటూరు కారం చేజారింది. నమ్మిన దర్శకుడు త్రివిక్రమ్ తీరని ద్రోహం చేశాడు. మెయిన్ హీరోయిన్ పూజాను డెమోట్ చేసి శ్రీలీలను మెయిన్ హీరోయిన్ ప్రమోట్ చేశాడు. ఆ అవమానం భరించలేక తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసి గుంటూరు కారం టీమ్ కి గుడ్ బై చెప్పేసింది. ఈ ప్రాజెక్ట్ తనను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందని ఆశపడిన పూజాకు నిరాశే ఎదురైంది.
ప్రస్తుతం ఒక్క తెలుగు సినిమా కూడా ఆమె చేతిలో లేదు. ఈ క్రమంలో పూజా మానసిక వేదనకు గురవుతున్నారని తెలుస్తుంది. ఆ మధ్య శ్రీలంక టూర్ కి వెళ్లి వచ్చింది. తాజాగా ఆమె వైట్ బాడీ కాన్ డ్రెస్ లో సెక్సీగా దర్శనమిచ్చింది. సదరు ఫోటోలకు పీస్(శాంతి) అని కామెంట్ పెట్టింది. కాబట్టి పూజా హెగ్డే మనశ్శాంతి లేక బాధపడుతుంది, ఆమెకు పీస్ ఆఫ్ మైండ్ కావాలని పలువురు అంచనా వేస్తున్నారు. ఇక పూజా కెరీర్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.
View this post on Instagram