Pooja Hegde Surgery: హీరోయిన్ పూజా హెగ్డే కెరీర్ నెమ్మదించింది. ఆమె చేతిలో ఒక్క ప్రాజెక్ట్ లేదు. కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నా అధికారికంగా ప్రకటించలేదు. తెలుగులో పూజా చివరి చిత్రం ఆచార్య. ఎఫ్ 3 మూవీలో ఐటెం సాంగ్ చేసింది. గుంటూరు కారం చిత్రం నుండి మధ్యలో తప్పుకుంది. మహేష్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రం వదులుకోవడం వెనుక కొన్ని కారణాలు వినిపించాయి. శ్రీలీలను మెయిన్ హీరోయిన్ చేసి తనను సెకండ్ హీరోయిన్ గా డిమోట్ చేశారని, అందుకే ఆమె ప్రాజెక్ట్ వదిలేశారంటూ కథనాలు వెలువడ్డాయి.
అయితే అసలు కారణం వేరే ఉంది అంటున్నారు.కొన్నాళ్లుగా పూజా హెగ్డే కాలి మడమ నొప్పితో బాధపడుతున్నారట. రాధే శ్యామ్ షూటింగ్ నాటికే ఆమెకు ఈ సమస్య ఉందట. కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ విడుదలకు ముంది పూజా కాలికి బ్యాండేజ్ తో కనిపించారు. ఇటీవల కాలి నొప్పి పెరిగిపోయిందట. వైద్యులు సర్జరీ సూచించారట. ఈ క్రమంలో ఆమె కాలికి సర్జరీ జరిగిందట. గాయం పూర్తిగా మానేవరకు ఎలాంటి షూటింగ్స్ లో పాల్గొనకూడదని వైద్యులు చెప్పారట.
అందుకే పూజా హెగ్డే గుంటూరు కారం మూవీ నుండి అర్థాంతరంగా తప్పుకుందట. భవదీయుడు భగత్ సింగ్ సినిమా కూడా తానే చేయాల్సి ఉండగా సున్నితంగా తిరస్కరించారట. కొన్నాళ్ల పాటు పూజా హెగ్డే సిల్వర్ స్క్రీన్ పై కనిపించే సూచనలు లేవంటున్నారు. మరి ఇదే నిజమైతే ఆమె అభిమానులు నిరాశకు గురి కావడం ఖాయం. పూజకు సర్జరీ జరిగిందన్న విషయం పై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. పరిశ్రమలో ప్రముఖంగా వినిపిస్తోంది .
కాగా సాయి ధరమ్ తేజ్ హీరోగా దర్శకుడు సంపత్ నంది ఓ మూవీ చేస్తున్నారట. ఈ చిత్ర హీరోయిన్ గా పూజా హెగ్డే ఎంపికయ్యారని అంటున్నారు. ఇక పూజా హేగే హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ అనంతరం ఆమెకు హిట్ లేదు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ పరాజయం పాలయ్యాయి.