KA Paul – Naveen Polishetty : కేఏ పాల్ ను అవాక్కయ్యేలా చేసిన హీరో నవీన్ పొలిశెట్టి.. ఈ వీడియో చూడాల్సిందే..

అప్పటివరకూ కేఏ పాల్ కారు చుట్టూ నిలబడిన ఫ్యాన్స్ అంతా పక్కనే కారులోంచి లేసిన హీరో నవీన్ పొలిశెట్టి కనిపించగానే అతడి వైపు మరిలారు. నవీన్ ఆటోగ్రాఫ్ ల కోసం.. ఆయనతో షేక్ హ్యాండ్ కోసం ఎగబడ్డారు.

Written By: NARESH, Updated On : August 28, 2023 5:43 pm
Follow us on

KA Paul hero Naveen Polishetty : కేఏ పాల్.. పొలిటికల్ కామెడీకి కేరాఫ్ అడ్రస్.. ఇక మన నవీన్ పొలిశెట్టి సినీ కామెడీకి అసలు సిసలు అడ్రస్. జాతిరత్నాలు మూవీతో ఎంత సందడి చేశారో అందరం చూశాం. ఇప్పటికీ బయట కనిపించినా నవీన్ పొలిశెట్టిలో అదే అల్లరి కనిపిస్తుంటుంది.

తాజాగా ‘శెట్టి వర్సెస్ పొలిశెట్టి’ అనే మూవీలో నవీన్ నటిస్తున్నారు. ఆ సినిమా ప్రమోషన్లలో భాగంగా వైజాగ్ లో సందడి చేశారు. వైజాగ్ బీచ్ రోడ్డుకు సరదాగా వెళ్లగా.. అక్కడే మన పొలిటీషియన్ కేఏ పాల్ కారు పైకప్పులోంచి జనానికి అభివాదం చేస్తూ కనిపించాడు.

అప్పటివరకూ కేఏ పాల్ కారు చుట్టూ నిలబడిన ఫ్యాన్స్ అంతా పక్కనే కారులోంచి లేసిన హీరో నవీన్ పొలిశెట్టి కనిపించగానే అతడి వైపు మరిలారు. నవీన్ ఆటోగ్రాఫ్ ల కోసం.. ఆయనతో షేక్ హ్యాండ్ కోసం ఎగబడ్డారు.

కేఏ పాల్ సైతం హీరో నవీన్ పొలిశెట్టి క్రేజ్ చూసి అవాక్కయ్యారు. తర్వాత తేరుకొని నవీన్ కు అభివాదం చేశారు. హీరో నవీన్ సైతం కేఏ పాల్ కు అభివాదం చేసి నమస్కారం అంటూ మాటలు కలిపారు. ఇలా ఒక పొలిటీషియన్, హీరోలు కార్లపైనుంచే మాట్లాడుకొని ముగించారు.