https://oktelugu.com/

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ లో ప్రేమ పుట్టిందిరోయ్.. ఇదిగో వీడియో

Bigg Boss 5 Telugu: తెలుగు బుల్లితెర బిగ్ బాస్ లో ప్రేమ పుట్టేసింది. తాజాగా ఈరోజుకు సంబంధించిన ఎపిసోడ్ కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. అందులో బుల్లితెర యాంకర్లు రవి, కాజల్ తో ఇంటి సభ్యులను ఈరోజు ఇంటర్వ్యూలు చేయించారు. వారి ఇంటర్వ్యూలతో హౌస్ లో ఎవరెవరు ఎవరెవరిని ప్రేమిస్తున్న విషయం క్లియర్ కట్ గా తెలిసిపోయింది. ముందుగా యాంకర్ రవికి పెళ్లికాకుంటే ఎవరిని ప్రపోజ్ చేస్తాడని అడిగితే ‘కాజల్’కు అంటూ ప్రశ్న అడిగిన ఆమెకే […]

Written By:
  • NARESH
  • , Updated On : September 17, 2021 / 06:43 PM IST
    Follow us on

    Bigg Boss 5 Telugu: తెలుగు బుల్లితెర బిగ్ బాస్ లో ప్రేమ పుట్టేసింది. తాజాగా ఈరోజుకు సంబంధించిన ఎపిసోడ్ కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. అందులో బుల్లితెర యాంకర్లు రవి, కాజల్ తో ఇంటి సభ్యులను ఈరోజు ఇంటర్వ్యూలు చేయించారు. వారి ఇంటర్వ్యూలతో హౌస్ లో ఎవరెవరు ఎవరెవరిని ప్రేమిస్తున్న విషయం క్లియర్ కట్ గా తెలిసిపోయింది.

    ముందుగా యాంకర్ రవికి పెళ్లికాకుంటే ఎవరిని ప్రపోజ్ చేస్తాడని అడిగితే ‘కాజల్’కు అంటూ ప్రశ్న అడిగిన ఆమెకే పంచ్ ఇచ్చాడు రవి. ఇక ఆ తర్వాత గాయకుడు శ్రీరాం చంద్రను ఇంటర్వ్యూ చేయగా.. మరదలుగా సిరి ఓకే.. భార్యగా హమీదకు ఓటేశాడు. ఇక హమీద కూడా తన క్రష్ శ్రీరాంచంద్ర అనడంతో వారిద్దరికి కలిపి ‘మనోహర’ సాంగ్ వేసి బిగ్ బాస్ మరింతగా వారి మధ్యప్రేమ పుట్టేలా చేశాడు.

    ఇక వీరే కాదు.. బిగ్ బాస్ లో మరో లవ్ స్టోరీ కూడా పొడిచింది. గత రెండు మూడు రోజులుగా హగ్గులతో రెచ్చిపోతున్న హీరో మానస్, హీరోయిన్ లహరిలు ప్రేమలో ఉన్నట్టుగా అర్థమవుతోంది. అదే విషయాన్ని యాంకర్ రవి అడిగేశాడు.. ‘నీకు భార్యగా ఈ హౌస్ లో ఎవరు బెటర్?’ అని మానస్ ను ప్రశ్నించాడు యాంకర్ రవి.. దానికి మొహమాట పడకుండా ‘లహరి’ అని చెప్పేశాడు.. మరదలుగా ప్రియాంకసింగ్ కు ఓటేశాడు.

    బిగ్ బాస్ 3,4 బాగా హిట్ అయ్యిందని ఈ ప్రేమల వల్లే. ఎవర్ గ్రీన్ ప్రేమ జంటలు హౌస్ లో రోమాన్స్ తో రెచ్చిపోయారు. ఇప్పుడు తాజా బిగ్ బాస్ 5లో లహరి-మానస్, హమీదా-శ్రీరాంల జంటలు హౌస్ లో రోమాన్స్ తో రెచ్చిపోవడం మొదలైంది. ఈ ప్రేమ హౌస్ వరకేనా? లేక బయట కూడా కొనసాగుతుందా? అనేది వేచిచూడాలి.

    ఇలా బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్ మంచి కలర్ ఫుల్ గా సాగనుందని అర్థమవుతోంది.