Divyavani: మహానాడు వేదికగా నాకు అవమానం జరిగింది. ప్రాధాన్యత ఇవ్వలేదు. టీడీపీ అధికార ప్రతినిధికి కనీసం మాట్లాడే అధికారం ఇవ్వరా? ఓ కళాకారుడు స్థాపించిన పార్టీలో కళాకారులకు, మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా? అంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై వ్యతిరేక బావుటా ఎగరవేసింది నటి దివ్యవాణి. ఆ వెంటనే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. కాసేపటికి ఆ ట్వీట్ డిలీట్ చేసిన నేపథ్యంలో మనసు మార్చుకున్నారేమో అని అందరూ భావించారు.
అయితే టీడీపీలో కొనసాగాలా వద్దా? అనే నిర్ణయం చంద్రబాబుతో భేటీ తర్వాత ఆమె నిర్ణయించాలని అనుకున్నారు. ఈ మేరకు నారా చంద్రబాబును ఆమె కలిశారు. అక్కడ ఎలాంటి చర్చలు జరిగాయో తెలియదు కానీ… దివ్యవాణి మీడియా ముఖంగా నేడు ఫైర్ అయ్యారు. టీడీపీకి తాను చేసిన సేవలు గుర్తు చేస్తూ, పార్టీలో జరిగిన అవమానాన్ని వెల్లడించారు. ఈ క్రమంలో ఆమె కొంత పరుషపదజాలం వాడారు.
Also Read: Pooja Hegde: పూజాకు బ్యాడ్ టైం స్టార్ట్… మహేష్ మూవీ నుండి అవుట్!
తనలాగే టీడీపీ పార్టీలో ఉన్న చాలా మంది మహిళలు అవమానాలు, వేధింపులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. పనిలో పనిగా ఆమె బాలయ్యపై కూడా విమర్శలు చేశారు. ఆమె మాట్లాడుతూ…. ”ఎవడో అన్నాడు… బాలకృష్ణ కంటే మీరు హీరోనా? అని. అవును బాలకృష్ణ కంటే నేనే హీరోని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి భార్యపై విపక్షాలు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు అందరికంటే ముందు నేనే రియాక్ట్ అయ్యాను. ఆ మాటలు ఖండించారు. చివరికి కేంద్రాన్ని, మోడీని కూడా నిలదీశాను. బాలయ్యతో పోల్చుకుంటే నేనే పెద్ద హీరోను” అని దివ్యవాణి తెలియజేశారు.
సుదీర్ఘంగా సాగిన దివ్యవాణి ప్రెస్ మీట్ ఏపీలో సంచలనంగా మారింది. మరి ఆమె ఆరోపణలకు, విమర్శలకు టీడీపీ మహిళా నేతలు ఎలాంటి సమాధానం చెబుతారో, కౌంటర్లు ఇస్తారో చూడాలి. నటిగా పెళ్లి పుస్తకం, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం చిత్రాల ద్వారా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. 2005లో విడుదలైన రాధా గోపాలం మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన దివ్యవాణి…. పంచాక్షరి, వీర, మహానటి చిత్రాల్లో నటించారు.
Also Read:Jabardasth Vinod: అందరూ తిట్టినా.. తండ్రయిన జబర్ధస్త్ లేడీ గెటప్ ఆర్టిస్ట్