
‘బుట్ట బొమ్మ పూజా హెగ్డే’ తన ఫాలోయర్లకు, అలాగే తన అభిమానులకు హగ్గులు, ముద్దులు ఇస్తోంది. కాకపోతే డైరెక్ట్ గా కాదులేండి. తన ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ నుండి ఈ హగ్గులు ముద్దులు ప్రోగ్రామ్ ను పెట్టుకుంది. ఎందుకు ఇంత సడెన్ గా ఈ డస్కీ బ్యూటీ ఈ పనిని పెట్టుకుందంటే.. అమ్మడికి అనందం కలిగింది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ బ్యూటీని ఫాలో చేస్తున్నవారి సంఖ్య 13 మిలియన్ల (1 కోటీ 30 లక్షలు) కు చేరుకుంది. దాంతో అనందం పట్టలేక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మెసేజ్ పోస్ట్ చేస్తూ.. ‘‘ఫాలోయర్లు, అభిమానులు అందరికీ థ్యాంక్స్. మీ అందరికీ నా హగ్గులు, ముద్దులు’’ అంటూ పూజా హెగ్డే మెసేజ్ లో పోస్ట్ చేసింది.
ఏది ఏమైనా టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా విపరీతమైన క్రేజ్ తో చలామణి అవుతోన్న ఏకైక హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే.. ముందు వరుసలో నిలిచే పేరు ‘పూజా హెగ్డే’దే. అసలు బుట్ట బొమ్మలా లేకపోయినా ఈ టాల్ బ్యూటీకి బుట్ట బొమ్మ అంటూ మంచి ఫాలోయింగ్ క్రియేట్ అయింది. పైగా పూజా హెగ్డేకి ఇటు దక్షిణాది అభిమానులు రోజురోజుకూ పెరుగుతున్నట్లుగానే అటు ఉత్తరాది అభిమానులు కూడా రోజురోజుకూ పెరుగుతూ పోతూ ఉండటంతో అమ్మడికి బాలీవుడ్ లో కూడా బాగా డిమాండ్ ఉంది.
ఎప్పుడూ హాట్ ఫోటో షూట్ లతో పాటు యోగా, జిమ్ వీడియోలను కూడా ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఎకౌంట్స్ లో పోస్ట్ చేస్తూ ఫాలోయర్ల సంఖ్య పెంచుకుంటున్న ఈ బ్యూటీ.. యాడ్స్ కూడా బాగా చేస్తూ తన క్రేజ్ ను క్యాష్ చేసుకుంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో 13 మిలియన్ల ఫాలోయర్ల సంఖ్యను పెంచుకోవడమే అమ్మడు ప్రస్తుత టార్గెట్ అట. ఇప్పుడు హీరోయిన్లు అంతా ఫాలోవర్ల పైనే పడ్డారు. ఎంత ఎక్కువమంది ఫాలోవర్లు ఉంటే, అంత ఎక్కువుగా యాడ్స్ వస్తున్నాయి. అలాగే అంత ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారు.
ఏది ఏమైనా పూజా లక్కీ హీరోయిన్. నిజానికి పూజా కంటే అందగత్తెలు ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. ఇంకా వస్తూనే ఉన్నారు. అయినా ఈ డస్కీ బ్యూటీకి మొదటి నుండి మంచి డిమాండ్ క్రియేట్ అయింది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుంటే.. యాక్టింగ్ పరంగా ‘పూజా హెగ్డే’ గొప్ప నటి ఏమి కాదు. అయినా ఈ బ్యూటీకి చాల ఈజీగా స్టార్ డమ్ రావడం.. అది పాన్ ఇండియా రేంజ్ లో రావడం అంటే అది ఒక్క పూజాకే దక్కిన అదృష్టం.