
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే పదవీకాలం నేటితో ముగియనుంది. ఈ క్రమంలో ఆయన ఇవాళ పదవీ విరమణ చేయనున్నారు. రేపు సాయంత్రం వర్చువల్ గా జస్టిస్ బోబ్డే వీడ్కోలు సమావేశం నిర్వహించనున్నారు. సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర పతి భవన్ లో 48 వ సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ చేత రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ ప్రమాణం చేయించనున్నారు.