
రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 6206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులిటెన్ లో తెలిపింది. అలాగే 29 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మహమ్మారి నుంచి 3,052 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 52,726 యాక్టివ్ కేసులున్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.