Pooja Hegde: పూజా హెగ్డే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రేజీ బ్యూటీ అంటూ నేషనల్ రేంజ్ లో ఆమె ఫుల్ ఫాలోయింగ్ సంపాదించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన రాధేశ్యామ్ బాక్సాఫీస్ ను దున్నేస్తోంది. అయితే, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా హెగ్డే మాట్లాడుతూ.. ‘మొదట్లో నన్ను ఐరన్ లెగ్ అన్నారు’ అని ఈ స్టార్ హీరోయిన్ ఎమోషనల్ అయింది. పైగా కెరీర్ ప్రారంభంలో నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను.

ఒకటి, రెండు సినిమాలు మొదలై ఆగిపోయే సరికి, నా పై ఐరన్ లెగ్ అని ముద్ర కూడా వేశారని పూజా హెగ్డే తెలిపింది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. ‘నేను అప్పట్లో ఒక స్టూడియోకి వెళ్ళాను. అక్కడ నన్ను చూసిన కొంతమంది.. నన్ను చూపించి ఈమె స్టార్ హీరోయిన్ అట.. ఈమెకన్నా ఐటమ్ సాంగ్స్ చేసే వాళ్ళే అందంగా ఉంటారు’ అంటూ కామెంట్స్ చేశారు.
Also Read: మహేష్ బాబు’ మరదలిగా ప్రముఖ హీరో కుమార్తె
ఆ సమయంలో దాన్ని బాగా ప్రచారం కూడా చేశారు. మొదట్లో నాకు బాధగా అనిపించినా, అవేమీ పట్టించుకోకుండా ముందుకెళ్లాను అంటూ చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. ఇక ఒక సక్సెస్ రాగానే ఆ విమర్శలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయని చెప్పుకొచ్చింది ఏది అయితే ఏం.. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. ఎలాగూ సర్కారులో మహేష్ సరసన చేస్తోంది,

ఇప్పుడు వంశీ పైడిపల్లి – విజయ్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించబోతుంది. అన్నట్టు ఎన్టీఆర్ సినిమా కూడా చేస్తోంది. ఆల్ రెడీ ఆచార్య సినిమా చేసింది. మొత్తానికి పూజా హెగ్డే దూసుకుపోతుంది. ఇక ఆమె ప్రధాన పాత్రల్లో వస్తోన్న సినిమాలు ఎక్కువైపోయాయి.
Also Read: ‘రాధేశ్యామ్’ మూవీలో అద్భుత హైలెట్స్.. ప్రధాన లోపాలేంటో తెలుసా?
[…] Karthika Deepam Serial: తెలుగు వారు సెంటిమెంట్ కు ఫిదా అవుతారు. అది సీరియళ్లు అయినా సీరియస్ విషయాలైనా తెలుగువారి రూటే వేరు. పరాయి భాష అయినా మన భాష అయినా సరే నచ్చితే ప్రాణంగా చూస్తారు. లేదంటే పట్టించుకోరు. ఇటీవల తెలుగువారికి బాగా దగ్గరైన సీరియల్ కార్తీక దీపం. అందులోని పాత్రలను తమ నిజజీవితంలో పాత్రలుగా భావించుకుని నిత్యం స్మరించుకుంటూ రాబోయే ఎపిసోడ్ల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ సీరియల్ ఇక ముగించినట్లు తెలుస్తోంది. అందులోని పాత్రలు నిరుపమ్, వంటలక్క లు చనిపోయినట్లు చూపించడంతో ఇక ఆ సీరియల్ కథ ముగిసినట్లేనని చెబుతున్నారు. […]