Homeఎంటర్టైన్మెంట్RK Roja Jabardasth: జబర్దస్త్ కి ఇక సెలవు, రోజా సంచలన నిర్ణయం

RK Roja Jabardasth: జబర్దస్త్ కి ఇక సెలవు, రోజా సంచలన నిర్ణయం

RK Roja Jabardasth: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం రోజుకో మలుపు తీసుకుంటున్న సంగతి మన అందరికి తెలిసిందే..ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఎవ్వరి ఊహకి అందని స్థాయి లో ఉంటున్నాయి..ఇటీవలే ఆయన తన మంత్రివర్గ కాబినెట్ మొత్తం రద్దు చేసిన సంగతి మన అందరికి తెలిసిందే, ఎన్నికలలో గెలిచిన వెంటనే మంత్రి కాబినెట్ కూర్పు భవిష్యత్తులో కచ్చితంగా ఉంటుంది అని,తనతో ఇనాళ్ళు కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి మంత్రి వర్గం లో చోటు కల్పించే అవకాశం ఇస్తాను అని ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ, ఇప్పుడు సరికొత్త మంత్రి వర్గ కాబినెట్ తో మన ముందుకి వచ్చాడు, 25 మంది తో కూడిన లేటెస్ట్ కాబినెట్ తో ఈరోజు సచివాలయం లో ప్రమాణస్వీకారం చేయించాడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు..ఈ కాబినెట్ లో ఎమ్యెల్యే రోజా గారు కూడా ఉండడం విశేషం..ఈమె జగన్ గారితో వైసీపీ పార్టీ ప్రారంభ స్థాయి నుండి ప్రయాణం చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇన్నేళ్లు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన తనకి మంత్రి పదవి ఇవ్వడం తో ఆమె ఆనందానికి హద్దులే లేకుండా పొయ్యాయి.

RK Roja Jabardasth
RK Roja Jabardasth

ఈ సందర్భంగా రోజా గారు మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది, ఆమె మాట్లాడుతూ ‘చాలా సంతోషంగా ఉంది, నేను తెలుగుదేశం పార్టీ లో ఉన్నప్పుడు ఆ పార్టీ లో కొంతమంది నాయకులూ నన్ను అసెంబ్లీ గేట్ కూడా తొక్కనివ్వము అని చెప్పేవారు..కానీ జగన్ గారు నన్ను రెండు సార్లు MLA ని చెయ్యడమే కాకుండా, ఈరోజు తన మంత్రి కాబినెట్ లో స్థానం కల్పించారు..ఆయనకి ఈ సందర్భంగా పాదాభివందనాలు చేస్తున్నాను..ఆయన నాకు ఇచ్చిన ఈ బాధ్యతని నూటికి నూరు పాళ్ళు న్యాయం చేసి రాష్ట్ర అభివృద్ధికి నావంతు కృషి చేస్తాను..నా పై ఇప్పుడు చాలా బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఇక నుండి నేను సినిమాలకు మరియు టీవీ షోస్ కి గుడ్ బాయ్ చెప్పేస్తున్నాను, జబర్దస్త్ లో నేను దాదాపుగా 10 ఏళ్ళ నుండి జెడ్జిగా కొనసాగుతున్నాను, ఇక ఆ షో కి కూడా సెలవు ప్రకటించాల్సిన సమయం వచ్చేసింది..ఇక నుండి నా జీవితం సంపూర్ణంగా ప్రజాసేవకే అంకితం’ అంటూ చెప్పుకొచ్చారు రోజా గారు.

RK Roja Jabardasth
RK Roja Jabardasth

సోషల్ మీడియా లో వస్తున్నా సమాచారం ప్రకారం అయితే రోజా గారికి జగన్ గారు హోమ్ మినిస్ట్రీ పదవి ఇవ్వబోతున్నాడు అని తెలుస్తుంది, ఇదే విషయం ని ఈరోజు ఆమెని ఒక్క విలేకరి అడగగా ‘నాకు ఏ పదవి ఇస్తారో తెలియదు..జగన్ అన్న కాబినెట్ లో నేను ఉన్నాను, అదే చాలు నాకు..ఏ పదవి ఇచ్చిన నూటికి నూరుపాళ్లు నా తరుపున సంపూర్ణమైన కృషి చేసి న్యాయం చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చారు, రోజా తో పాటు మొదటి నుండి జగన్ తో కలిసి రాజకీయ ప్రయాణం చేసిన అంబటి రాంబాబు కి కూడా మంత్రివర్గ కాబినెట్ లో చోటు లభించింది..అయితే మంత్రి పదవి కోసం ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న కొంతమందికి మంత్రి పదవి రాకపోవడం తో తీవ్రమైన అసంతృప్తి చెందారు..మేకతోటి సుచరిత మరియు అన్న రాంబాబు వంటి వారు వైసీపీ పార్టీ కి రాజీనామా చేసారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular