James Movie Closing Collections: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం మన అందరిని ఎంత బాధకి గురి చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..తెలుగు ప్రేక్షకులకు ఆయన పెద్దగా సుపరిచితుడు కాకపోయినప్పటికీ కూడా ఆయన చేసిన ఎన్నో మంచి కార్యక్రమాలు సోషల్ మీడియా ద్వారా తెలిసి,ఇలాంటి గొప్ప మనిషిని మనం కోల్పోయామా అని బాధపడని తెలువాడు అంటూ ఎవ్వరు మిగలలేదు అని అనడం లో ఎలాంటి సందేహం లేదు..ఇక ఆయన చేసిన డ్యాంసులు మరియు యాక్షన్ సన్నివేశాలను యూట్యూబ్ లో మన తెలుగోళ్లు చూసి ఆయన మీద మరింత అభిమానం పెంచుకున్నారు..ఆయన హీరో గా నటించిన ఆఖరి సినిమా జేమ్స్ మార్చి 17 తారీఖున పునీత్ రాజ్ కుమార్ గారి పుట్టిన రోజు సందర్భంగా అన్ని బాషలలో విడుదల అయ్యి భారీ విజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే..పునీత్ రాజ్ కుమార్ గారి ఆఖరి సినిమా కావడం తో కన్నడ ప్రేక్షుకులు మరియు అభిమానులు ఈ సినిమాకి బ్రహ్మరధం పట్టారు..మొదటి మూడు రోజులు ఈ సినిమాకి అమ్ముడుపోయిన టికెట్స్ ఇప్పటి వరుకు కన్నడ చిత్ర పరిశ్రమ లో ఏ సినిమాకి కూడా అమ్ముడుపోలేదు అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు, బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా కలెక్షన్స్ ఇప్పుడు క్లోసింగ్ దశకి చేరుకున్నాయి..ప్రపంచవ్యాప్తంగా అన్ని బాషలలో ఈ సినిమా ఇప్పటి వరుకు ఎంత వసూలు చేసిందో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

మొదటి రోజు ఈ సినిమా కనివిని ఎరుగని రేంజ్ లో దాదాపుగా 30 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసి ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు ని సృష్టించింది..వాస్తవానికి కన్నడ చిత్ర పరిశ్రమ లో అత్యధిక డే 1 రికార్డ్స్ కలిగి ఉన్న ఏకైక హీరో పునీత్ రాజ్ కుమార్..అలాంటిది ఆయన చివరి సినిమా అంటే మనం ఏ స్థాయి వసూళ్లను ఊహించామో, దానికి మించే వసూళ్లను రాబట్టి పునీత్ రాజ్ కుమార్ గారికి గొప్ప నివాళి అర్పించింది ఈ సినిమా..మొదటి రోజు ఆ స్థాయి వసూలల్ను రాబట్టిన ఈ సినిమా రెండవ రోజు మరియు మూడవ రోజు కూడా అదే ఊపు ని కొనసాగిస్తూ తోలి మూడు రోజుల్లోనే దాదాపుగా 70 కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ ని వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది..కేవలం వీకెండ్స్ లో మాత్రమే కాదు, పని దినాలలో కూడా ఈ సినిమాకి హౌస్ ఫుల్ బోర్డులు కర్ణాటక మొత్తం పడ్డాయి అంటే పునీత్ రాజ్ కుమార్ గారికి జనాల్లో ఎంత ఆదరణ ప్రేమ ఉందొ అర్థం చేసుకోవచ్చు.

మధ్యలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR మూవీ జేమ్స్ సినిమాకి పోటీగా వచ్చి కర్ణాటక ప్రాంతం లో ప్రభంజనం సృష్టించినప్పటికీ కూడా జేమ్స్ కలెక్షన్స్ పై ఏ మాత్రం ఎఫెక్ట్ చూపించలేకపోయింది అనే చెప్పాలి..కేవలం కర్ణాటక రాష్ట్రం నుండే ఈ సినిమా దాదాపుగా 90 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి ప్రభంజనం సృష్టించింది..ఇప్పటి వరుకు కర్ణాటక ప్రాంతం లో KGF చాప్టర్ 1 సినిమా కాకుండా 90 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన చిత్రం గా పునీత్ రాజ్ కుమార్ గారు నటించిన రాజకుమారా అనే సినిమా నిలిచింది..ఇప్పుడు తన సినిమా రికార్డుని తానె బద్దలు కొట్టుకొని జేమ్స్ సినిమాతో సరికొత్త చరిత్ర సృష్టించాడు పునీత్ రాజ్ కుమార్..ఈ సినిమా తెలుగు లో కూడా 10 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాల అంచనా..మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి ఈ సినిమా దాదాపుగా 110 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి KGF తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా సరికొత్త ప్రభంజనం సృష్టించింది.