Pooja Hegde: టెన్నిస్ బంతుల పాపగా మారిపోయిన పూజా బేబీ… మైండ్ బ్లోయింగ్ లుక్ వైరల్

ఏడాదిన్నగా పూజా హెగ్డేకు కాలం కలిసి రావడం లేదు. ఆమె వరుస పరాజయాలతో సతమతం అవుతుంది. రాధే శ్యామ్ తో మొదలైన బ్యాడ్ టైం కొనసాగుతుంది.

Written By: NARESH, Updated On : October 21, 2023 9:51 am
Follow us on

Pooja Hegde: కెరీర్ సంగతి ఎలా ఉన్నా లైఫ్ ఎంజాయ్ చేస్తుంది పూజా హెగ్డే. ఇటీవల మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్ళింది. బర్త్ డే నేపథ్యంలో అక్కడే వేడుకలు జరుపుకుంది. అందమైన సాగర తీరంలో సేద తీరింది. పూజా హెగ్డే బికినీ ఫోటోలు వైరల్ అయ్యాయి. తాజాగా టెన్నిస్ ప్లేయర్ లుక్ లో సూపర్ హాట్ గా దర్శనమిచ్చింది. పూజా హెగ్డే స్పోర్ట్స్ లుక్ కేక పుట్టిస్తుంది. షార్ట్ ఫ్రాక్ లో హాట్ ఫోజ్ అదిరిందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పూజా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఏడాదిన్నగా పూజా హెగ్డేకు కాలం కలిసి రావడం లేదు. ఆమె వరుస పరాజయాలతో సతమతం అవుతుంది. రాధే శ్యామ్ తో మొదలైన బ్యాడ్ టైం కొనసాగుతుంది. ఒకటా రెండా… ఏకంగా అరడజను ప్లాప్స్ వరుసగా ఇచ్చింది. అవి కూడా భారీ డిజాస్టర్స్. ఆచార్య, బీస్ట్, సర్కర్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఎఫ్ 3 చిత్రంలో ఐటెం నంబర్ చేయగా అది కూడా ప్లాప్.

ఒకప్పుడు గోల్డెన్ లెగ్ గా పేరుగాంచిన పూజా కాస్తా ప్రస్తుతం ఐరెన్ లెగ్ అయి కూర్చుంది. పరాజయాలకు తోడు ఒప్పుకున్న చిత్రాల నుండి ఆమె మధ్యలో తప్పుకోవాల్సి వచ్చింది. గుంటూరు కారం వంటి క్రేజీ ప్రాజెక్ట్ కోల్పోవడం పెద్ద దెబ్బ. కొన్ని రోజులు షూటింగ్ చేసిన పూజా హెగ్డే అనుకోని కారణాలతో ప్రాజెక్ట్ వదులుకుంది. దర్శకుడు పూరి-విజయ్ దేవరకొండ కాంబోలో మొదలైన జనగణమన మధ్యలో ఆగిపోయింది. ఇలా పూజాకు షాక్ మీద షాక్ అని చెప్పాలి.

ఇటీవల పూజా కాలికి సర్జరీ జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని ఆమె ధ్రువీకరించలేదు. అధికారికంగా పూజా కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటించలేదు. సాయి ధరమ్ హీరోగా దర్శకుడు సంపత్ నంది గంజా శంకర్ టైటిల్ తో ఓ మూవీ ప్రకటించారు. ఈ మూవీలో పూజా హీరోయిన్ అంటున్నారు. ఇటీవల టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. హీరోయిన్ ఎవరనేది ప్రకటించలేదు. స్టార్ హీరోల పక్కన పూజాకు ఇక కష్టమే అని చెప్పొచ్చు..