Pooja Hegde : పూజా హెగ్డే కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉండగా అమ్మడు ఆనందానికి హద్దులు లేకుండా ఉన్నాయి. షూటింగ్స్, మీటింగ్స్ నుండి కొంచెం విరామం దొరకడంతో చక్కగా మాల్దీవ్స్ చెక్కేసింది. అందమైన సాగర తీరంలో ఆహ్లాదంగా గడిపేస్తుంది. పూజా హెగ్డే మాల్దీవ్స్ విహారానికి వెళ్లి పది రోజులు అవుతుంది. అయినా ఆమె ట్రిప్ ఇంకా ముగియలేదు. దీవుల దేశంలో పూజా బట్టలు చాలా పొదుపుగా వాడుతుంది. వెకేషన్ మొత్తం బికినీలో గడిపేస్తుంది భామ. బీచ్ అంటే బికినీ వేర్ తప్పనిసరి అన్నట్లు ఉంది పరిస్థితి.
Also Read: అయ్యో.. ఏంటి జయసుధ ఇలా మారిపోయారు?

ఇక తన మాల్దీవ్స్ వెకేషన్ పిక్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటుంది. తాజాగా స్విమ్ సూట్ లో సముద్రంలో జలకాలాడుతున్న ఫోటోలు పంచుకున్నారు. ఇక పూజా ఫోటోలు చూసిన ఫ్యాన్స్… జలకన్యలా ఉన్నావంటూ కామెంట్ చేస్తున్నారు. అదే సమయంలో పూజా గ్లామర్ కి ఫిదా కావడంతో పాటు, క్రేజీ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. కాగా పూజా వెకేషన్ ముగింపుకు వచ్చిందని తెలుస్తుండగా.. మరలా షూటింగ్స్ లో బిజీ కానుంది.
రాధే శ్యామ్ షూటింగ్ పూర్తి చేసిన పూజా, విజయ్ కి జంటగా చేస్తున్న బీస్ట్ మూవీ చిత్రీకరణ పూర్తి చేయాల్సి ఉంది. అలాగే సల్మాన్ ఖాన్ కి జంటగా బాలీవుడ్ లో చేస్తున్న భాయ్ జాన్ షూటింగ్ లో కూడా ఆమె పాల్గొనాల్సి ఉంది. మొదట్లో ఈ చిత్రానికి కభీ ఈద్ కభీ దివాళి అనే టైటిల్ నిర్ణయించారు. అనంతరం భాయ్ జాన్ గా మార్చడం జరిగింది.

ఇక పూజా హెగ్డే(Pooja Hegde ) నటించిన ఆచార్య సైతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 4న వరల్డ్ వైడ్ గా ఈ మూవీ విడుదల అవుతుంది. కాగా మహేష్ తో త్రివిక్రమ్ ప్రకటించిన చిత్రంతో పాటు, హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ ప్రకటించిన భవదీయుడు భగత్ సింగ్ చిత్రాలలో హీరోయిన్ గా పూజా పేరు పరిశీలనలో ఉంది.
Also Read: పద్మశ్రీ ప్రభావం వల్లే కంగనా ఇలా ప్రవర్తిస్తోందా?