Chandrababu Davos Visit: పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) అడుగులు వేస్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ సదస్సులో పాల్గొనేందుకు తన బృందంతో ఈరోజు బయలుదేరి వెళ్ళనున్నారు. నాలుగు రోజులపాటు దావోస్ లో జరగనున్న ఈ కీలక పర్యటనలో.. ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యంగా విస్తృతస్థాయి సమావేశాలతో పాటు చర్చల్లో పాల్గొనున్నారు. గత ఏడాది సైతం చంద్రబాబు బృందం పెట్టుబడుల సదస్సుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అటు తరువాత కూడా పెద్ద ఎత్తున విదేశీ పర్యటనలు సాగాయి.
* వరుసగా రెండోసారి..
రెండోసారి దావోస్ (davos) పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు గట్టి ప్రణాళికలతోనే వెళుతున్నట్లు సమాచారం. ఆదివారం రాత్రి 8:35 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్ళనున్నారు. అక్కడినుంచి స్విట్జర్లాండ్ లోని జ్యూరీచ్ కు వారి ప్రయాణం జరగనుంది. అర్ధరాత్రి 1:45 గంటలకు వీరి విమానం ఢిల్లీ నుంచి బయలుదేరనుంది. ముందుగా స్విట్జర్లాండ్ లో భారత రాయబారి మృదుల్ కుమార్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. అనంతరం ఏ రోజు ఇన్నోవేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లుల్లా, రిథిమా లుల్లా, స్వనిత్ సింగ్ లతో సమావేశం కానున్నారు చంద్రబాబు. మరోవైపు భారత ఎంబసీ ఆధ్వర్యంలో నిర్వహించే తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. 20 దేశాల నుంచి వచ్చే ఎన్నార్టీలతో సమావేశం కానున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో దావోస్ పర్యటనకు బయలుదేరుతారు.
* దావోస్ పర్యటనలో తొలిరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తవుక్ ఆల్ మర్రి తో జరిగే వివిధ దేశాల సమావేశంలో సీఎం పాల్గొంటారు. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ తో సైతం భేటీ కానున్నారు. అదేరోజు అంతర్జాతీయ మీడియా సంస్థ పొలిటికో కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు.
* రెండో రోజు పర్యటనలో భాగంగా ఇండియా ఎట్ సెంటర్ జియోగ్రఫీ గ్రోత్, ఏపీ అడ్వాంటేజ్ అంశంపై సిఐఐ నిర్వహిస్తున్న బ్రేక్ ఫాస్ట్ సమావేశంలో సీఎం పాల్గొంటారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియా లాంజ్ ప్రారంభోత్సవానికి సైతం హాజరవుతారు. ఐబీఎం చైర్మన్, సీఈవో అరవింద్ కృష్ణ, గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కొరియన్లతో సీఎం కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా హాజరవుతారు.
* అదే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ పెన్యూర్ ప్యానల్ డిస్కషన్ లో సైతం సీఎం పాల్గొంటారు. సిఎన్బిసి ఇంటర్నేషనల్ కు సీఎం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ డారెన్ టాంక్ తో పాటు పలువురు ప్రముఖులతో సమావేశం కానున్నారు.
* మూడోరోజు పర్యటనలో భాగంగా పారిశ్రామిక అభివృద్ధి, ఇన్నోవేషన్, ఎనర్జీ ట్రాన్సిషన్, వాతావరణం మార్పులు, ఏఐ ఆధారిత గ్లోబల్ ఎకానమీ వంటి అంశాలపై జరిగే సెషన్లలో సీఎం పాల్గొంటారు.
* దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు 36 కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఇందులో మూడు ప్రభుత్వాల మధ్య కీలక సమావేశాలు, పారిశ్రామికవేత్తలతో వన్ బై వన్ సమావేశాలు 16 జరపనున్నారు. తొమ్మిది రౌండ్ టేబుల్ చర్చలు జరగనున్నాయి. అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇవ్వనున్నారు.
* జనవరి 22న దావోస్ పర్యటన ముగించుకొని.. 23 ఉదయం 8:25 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు..
