https://oktelugu.com/

Oscar: ఆస్కార్ బరిలో మనసానమః.. అవార్డు వరించేనా?

Oscar: ఆస్కార్​ అర్హత సాధించిన తెలుగు సినిమాను ఒక్కసారైనా చూడాలని అందరూ కోరుకునే వారు. కానీ, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అది సాధ్యం కాలేదు. అయితే, తాజాగా తొలిసారి ఓ సినిమా ఆస్కార్​ బరిలో నిలిచింది. మనసానమః ప్రస్తుతం ఈ సినిమా అకాడమీ సభ్యుల ఓటింగ్​ కోసం ప్రదర్శితం అవుతోంది. దర్శకుడు దీపక్​రెడ్డి తెరకెక్కించిన ఈ షార్ట్​ఫిల్మ్​ 2020లో విడుదలైంది. అప్పటి నుంచి 900కుపైగా అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. 300కుపైగా అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శించేందుకు అర్హత […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 24, 2021 / 12:19 PM IST
    Follow us on

    Oscar: ఆస్కార్​ అర్హత సాధించిన తెలుగు సినిమాను ఒక్కసారైనా చూడాలని అందరూ కోరుకునే వారు. కానీ, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అది సాధ్యం కాలేదు. అయితే, తాజాగా తొలిసారి ఓ సినిమా ఆస్కార్​ బరిలో నిలిచింది. మనసానమః ప్రస్తుతం ఈ సినిమా అకాడమీ సభ్యుల ఓటింగ్​ కోసం ప్రదర్శితం అవుతోంది. దర్శకుడు దీపక్​రెడ్డి తెరకెక్కించిన ఈ షార్ట్​ఫిల్మ్​ 2020లో విడుదలైంది.

    అప్పటి నుంచి 900కుపైగా అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. 300కుపైగా అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శించేందుకు అర్హత సాధించింది. ఈ క్రమంలోనే ఆస్కార్​ బరిలో తమ సినిమా నిలవడంపై మేకర్స్ స్పందించారు. ఆస్కార్ కోసం పోటీ పడుతున్న చిత్రాల్లో మనసానమః నిలవడం గర్వకారణమని అన్నారు. ఈ ప్రౌడ్​ మూమెంట్​ను ఆస్వాధిస్తున్నట్లు తెలిపారు.

    ఈ సినిమా బరిలో ఉన్న మిగతా సినిమాలను దాటుకుని.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆస్కార్​ సాధించిన తొలి సినిమా అవుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. మరి ఇన్ని అవార్డులు గెలుచుకున్న ఈ సినిమాను ఆస్కార్​ వరిస్తుందో లేదో చూడాలి.